EPFO UAN Generation : EPFO బిగ్ అప్‌డేట్.. ఇకపై ఫేస్ అథెంటికేషన్‌తో మీరే UAN క్రియేట్ చేయొచ్చు.. ఆటో-యాక్టివేట్.. ప్రాసెస్ ఇదిగో..!
EPFO UAN Generation : ఈపీఎఫ్ఓలో కొత్త సెల్ఫ్ సర్వీసు ఫీచర్.. ఇకపై మీకు మీరే UAN నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. ఆటో యాక్టివేట్ అవుతుంది. ఇదిగో ఇలా..

EPFO UAN Generation
EPFO UAN Generation : ఈపీఎఫ్ PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఫేస్ అథెంటికేషన్ ద్వారా UAN నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. ఇటీవలే ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ అమల్లోకి (EPFO UAN Generation) తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలతో చందాదారులపై కూడా ప్రభావం పడుతుంది. అంతేకాదు.. పీఎఫ్ అకౌంట్ కలిగిన వ్యక్తులు ఇప్పుడు తమ UAN నంబర్‌ను స్వతంత్రంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం పీఎఫ్ చందాదారులు కంపెనీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు.
మీ ఫేస్ స్కాన్ చేయడం ద్వారా UAN నంబర్‌ను క్రియేట్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ కొత్త మార్పుల్లో భాగంగా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ టెక్నాలజీ సాయంతో చందదారులు తమ ఇళ్ల నుంచే యూఏఎన్ నెంబర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వెంటనే యాక్టివేట్ చేయవచ్చు. పీఎఫ్ సంబంధిత సర్వీసుల్లో ASE పాస్ బుక్, క్లెయిమ్‌లను దాఖలు చేయడం, KYC అప్‌డేట్ చేయడం వంటి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది.
గతంలో కంపెనీనే పీఎం చందాదారుల సమాచారాన్ని అందించేది. కొన్నిసార్లు అడ్రస్ తప్పుగా అందించవచ్చు. ఉద్యోగి మొబైల్ నంబర్ కూడా రాంగ్ ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో పీఎఫ్ చందాదారుడి అకౌంట్ అప్‌డేట్స్ గురించి తెలిసే అవకాశం ఉండదు. దీని కారణంగా, ఈపీఎఫ్ఓ పీఎఫ్ చందదారులనుసంప్రదించలేకపోయింది. UAN యాక్టివేషన్ కోసం ఆధార్ OTP ధృవీకరణ అవసరం. దాంతో అనేక మంది చందాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కొత్త మార్పుతో కలిగే ప్రయోజనాలివే :
EPFO కొత్త మార్పులతో చందాదారులకు మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఉమాంగ్ యాప్ ద్వారా సులభంగా UAN క్రియేట్ చేసుకోవచ్చు. కంపెనీ యాజమాన్యంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆధార్ డేటాతో ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఐడెంటిటీని నేరుగా ధృవీకరించవచ్చు. ఈ ప్రక్రియ చాలా సురక్షితమైనది. UAN క్రియేట్ చేశాక ఆటోమాటిక్‌గా యాక్టివ్ అవుతుంది.
UAN జనరేట్ ఎలా చేయాలి? :
- ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఆపై ఇన్‌స్టాల్ చేయాలి.
- AadhaarFaceRD యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి “UAN Allotment and Activation”కి వెళ్ళండి.
- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లింక్ చేసిన చెక్‌బాక్స్‌లను టిక్ చేయాలి.
- ఆధార్ నంబర్ చెక్‌బాక్స్ కూడా టిక్ చేయాలి.
- మీరు ఇతర TP కూడా ధృవీకరించాలి.
- కెమెరాను ఆన్ చేసి ఫేస్ లైవ్ ఫోటో తీయండి.
- బోర్డర్ గ్రీన్ మారితే ఫొటో క్యాప్చర్ అయినట్టే
- ఫొటో ఆధార్ డేటాబేస్‌తో లింక్ అయి UAN ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది.
- UAN జనరేట్ అయిన వెంటనే ఆటో-యాక్టివేట్ అవుతుంది.
- ఉమాంగ్ యాప్ లేదా మెంబర్ పోర్టల్ నుంచి UAN కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.