Wireless Charging Smartphones : కేబుల్ అక్కర్లేదు భయ్యా.. టాప్ 3 వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. లైఫ్‌లో ఒక్కటైనా కొనాల్సిందే..!
Wireless Charging Smartphones : ఇలాంటి ఫోన్లు లైఫ్ లో ఒక్కసారైన కొనాల్సిందే.. కేబుల్ అవసరం లేకుండా వైర్‌లెస్ ఛార్జింగ్ అందించే స్మార్ట్‌ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి..

Wireless Charging Smartphones
Wireless Charging Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం టెక్ మార్కెట్ అనేక రకాల స్మార్ట్‌ఫోన్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రత్యేకించి (Wireless Charging Smartphones) వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే డిమాండ్ బట్టి స్మార్ట్ ఫోన్ మేకర్లు కూడా అదే స్థాయి ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
సరసమైన ధరలో చాలా తక్కువగా లభ్యమవుతున్నాయి. సరసమైన ధర నుంచి ప్రీమియం వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఏదైనా కొనేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ఫీచర్లు, ధర వివరాలను ఓసారి వివరంగా తెలుసుకుందాం..
ఒప్పో ఫైండ్ X8 ప్రో :
ఈ ఒప్పో ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 6000mAh బ్యాటరీ కలిగి ఉంది. 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ క్వాడ్ రియర్ కెమెరాతో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50MP, ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఒప్పో ఫైండ్ X8 ఫోన్ రూ. 99,999కు కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 FE :
ఈ శాంసంగ్ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్ (Wireless Charging Smartphones) సపోర్ట్‌తో వస్తుంది. 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. 4700mAh బ్యాటరీ సపోర్ట్ కలిగి ఉంది. ఎక్సినోస్ 2400e SoC ప్రాసెస్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ డిస్‌ప్లే ప్రొటెక్షన్‌తో వస్తుంది. 50MPతో ట్రిపుల్ కెమెరా సెటప్‌లో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 10MP కెమెరా కలిగి ఉంది. ధర విషయానికి వస్తే.. రూ. 42,350కు కొనుగోలు చేయవచ్చు.
ఇన్ఫినిక్స్ GT 30 ప్రో :
ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ను 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ధర రూ. 25 వేల కన్నా తక్కువ. 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. 108MP మెయిన్ సెన్సార్‌తో వస్తుంది. 5500mAh బ్యాటరీ కలిగి ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.