Google Pixel 9 Pro XL : పిక్సెల్ యూజర్లకు పండగే.. భారీగా తగ్గిన గూగుల్ పిక్సెల్ 9ప్రో XL ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతంటే?

Google Pixel 9 Pro XL : గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ ధర తగ్గింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 9 Pro XL

Google Pixel 9 Pro XL : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కావాలా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ (Google Pixel 9 Pro XL) మార్కెట్లో రూ.1,24,999కు లాంచ్ అయింది. సిగ్నేచర్ డిజైన్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఆకర్షణీయమైన డిస్‌ప్లే, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

అన్ని ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.94,999 లోపు ధరకే కొనుగోలు చేయొచ్చు. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, ఏఐ ఫీచర్ల కోసం చూస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ప్రో XL ధర ఎంతంటే? :
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ 16GB+256GB బేస్ వేరియంట్ ధర రూ. 1,04,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 20వేలు తగ్గింపు పొందవచ్చు. ఇంకా, HDFC బ్యాంక్ కార్డ్‌తో రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర రూ. 95వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.

ఈ ఆఫర్ ఈఎంఐ లావాదేవీలపై మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ కార్డ్‌  ద్వారా ఈఎంఐ ఆప్షన్లను 5 శాతం తగ్గింపు పొందవచ్చు. రూ. 1,500 క్యాష్‌బ్యాక్‌ కోసం యూపీఐ పేమెంట్ చేయవచ్చు.

Read Also : HP OmniBook Series : హెచ్‌పీ కొత్త ఏఐ ఆధారిత ఓమ్నిబుక్ 5, ఓమ్నిబుక్ 3 సిరీస్ ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

వర్కింగ్ కండిషన్ బట్టి.. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S23 ప్లస్ 5G కోసం రూ. 33వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అదనంగా చెల్లిస్తే ఎక్స్‌టెండెడ్ వారంటీ లేదా ఇతర యాడ్-ఆన్ కూడా కొనుగోలు చేయవచ్చు.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల LTPO OLED ప్యానెల్‌తో వస్తుంది. ఈ పిక్సెల్ 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో ప్రొటెక్షన్ వస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ టెన్సర్ G4 చిప్‌సెట్‌తో వస్తుంది. 16GB ర్యామ్, 5,060mAh బ్యాటరీ సపోర్టు కలిగి ఉంది.

ఈ పిక్సెల్ 9ప్రో XL ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ + 48MP అల్ట్రావైడ్ + 48MP 5x టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 42MP సెల్ఫీ లెన్స్ కలిగి ఉంది. ఈ పిక్సెల్ ఫోన్ IP68 సర్టిఫికేషన్‌ కూడా పొందింది. మ్యాజిక్ ఏఐ ఎడిటర్ వంటి అనేక ఏఐ ఫీచర్లను కలిగి ఉంది.