HP OmniBook Series : హెచ్‌పీ కొత్త ఏఐ ఆధారిత ఓమ్నిబుక్ 5, ఓమ్నిబుక్ 3 సిరీస్ ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

HP OmniBook Series : హెచ్‌పీ ఒమినిబుక్ 5, ఒమినిబుక్ 3 ల్యాప్‌టాప్ సిరీస్ వచ్చేశాయి.. ప్రారంభ ధర రూ. 69,999 నుంచి అందుబాటులో ఉన్నాయి.

HP OmniBook Series : హెచ్‌పీ కొత్త ఏఐ ఆధారిత ఓమ్నిబుక్ 5, ఓమ్నిబుక్ 3 సిరీస్ ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

HP OmniBook Series

Updated On : July 7, 2025 / 5:10 PM IST

HP OmniBook Series : హెచ్‌పీ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. హెచ్‌పీ ఇండియా నుంచి ఒమినిబుక్ 5, ఒమినిబుక్ 3 సిరీస్‌లను లాంచ్ చేసింది. హెచ్‌పీ ఒమినిబుక్ 5 అనే (HP OmniBook Series) 14-అంగుళాల ల్యాప్‌టాప్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ X Plus ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. హెచ్‌‌పీ ఒమినిబుక్ 3 మోడల్ 14-అంగుళాలు, 15.6-అంగుళాల స్క్రీన్ సైజు ఆప్షన్లలో వస్తుంది.

AMD Ryzen ఏఐ 300 ప్రాసెసర్‌లపై రన్ అవుతుంది. Copilot+ PCs సెకనుకు 40 నుంచి 55 ట్రిలియన్ ఆపరేషన్‌లను (TOPS) అందించే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌లను (NPU) కలిగి ఉంటాయి. హెచ్‌పీ ఒమినిబుక్ 5 59Wh బ్యాటరీని కలిగి ఉంది. అయితే, ఒమినిబుక్ 3 లైనప్ 41Wh బ్యాటరీని కలిగి ఉంది.

భారత్‌లో HP ఒమినిబుక్ 5, ఒమినిబుక్ 3 సిరీస్ ధర ఎంత? :
హెచ్‌పీ ఒమినిబుక్ 5 ల్యాప్‌టాప్ 14-అంగుళాల ధర రూ. 75,999 నుంచి ప్రారంభమవుతుంది. హెచ్‌పీ ఒమినిబుక్ 3 ల్యాప్‌టాప్ 14-అంగుళాల ప్రారంభ ధర రూ. 69,999 నుంచి అందుబాటులో ఉంటుంది. హెచ్‌పీ ఒమినిబుక్ 3 మోడల్ 15-అంగుళాల ధర రూ. 69,999తో లాంచ్ అయింది. అన్ని మోడళ్లు గ్లేసియర్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం HP ఆన్‌లైన్ స్టోర్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

HP ఒమినిబుక్ 5 స్పెసిఫికేషన్‌లు :
హెచ్‌పీ ఒమినిబుక్ 5 విండోస్ 11 హోంపై రన్ అవుతుంది. 14-అంగుళాల 2K (1,200×1,920 పిక్సెల్స్), OLED UWVA డిస్‌‌ప్లే 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 90.46 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది.

45 టాప్స్ వరకు ఏఐ పర్ఫార్మెన్స్‌తో డెడికేటెడ్ హెక్సాగాన్ NPUతో కూడిన స్నాప్‌డ్రాగన్ X ప్రాసెసర్ (X1-26-100)తో అమర్చి ఉంది. చిప్‌సెట్ క్వాల్‌కామ్ అడ్రినో GPUతో కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 16GB LPDDR5x ర్యామ్, 512GB SSD స్టోరేజీని కలిగి ఉంది.

Read Also : Retirement Plan Tax : ఏడాదికి రూ. 12 లక్షలకు పైగా సంపాదన.. పన్ను పరంగా రిటైర్మెంట్ ప్లాన్ ఎలా ఉండాలి? టాప్ 5 మార్గాలివే..!

కనెక్టివిటీ విషయానికి వస్తే.. హెచ్‌పీ ఒమినిబుక్ 5 బ్లూటూత్ 5.3, Wi-Fi 6E వంటి క్వాల్‌కామ్ ఫాస్ట్ కనెక్ట్ 6900 మోడెమ్‌తో కలిగి ఉంది. డిస్‌ప్లేపోర్ట్ 1.4a సపోర్టుతో రెండు USB టైప్-C పోర్ట్‌లు, ఒక USB టైప్-A పోర్ట్, హెడ్‌ఫోన్, మైక్రోఫోన్ కాంబో జాక్‌ను కలిగి ఉంది.

ఈ ల్యాప్‌టాప్ HP ఆడియో బూస్ట్ 2.0 ఫీచర్‌తో డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంది. HP ఆన్-డివైస్ ఏఐ చాట్‌బాట్, HP ఏఐ కంపానియన్‌తో వస్తుంది. ఫుల్-HD 1080 పిక్సెల్ IR కెమెరాను కలిగి ఉంది. మెరుగైన వీడియో కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం విండోస్ స్టూడియో ఎఫెక్ట్స్‌కు సపోర్టు ఇస్తుంది.

హెచ్‌పీ ఒమినిబుక్ 5లో 59Wh బ్యాటరీ కలిగి ఉంది. సింగిల్ ఛార్జ్ చేస్తే.. 34 గంటల వరకు ఛార్జింగ్ అందిస్తుంది. 65W పవర్ అడాప్టర్‌తో వస్తుంది. 30 నిమిషాల్లో బ్యాటరీని సున్నా నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 312x217x12.6mm, 1.35కిలోల బరువు ఉంటుంది.

హెచ్‌పీ ఒమినిబుక్ 3 సిరీస్ స్పెసిఫికేషన్లు :
హెచ్‌పీ ఒమినిబుక్ 3 రెండు స్క్రీన్ (14-అంగుళాలు, 15.6-అంగుళాలు) సైజు ఆప్షన్లలో లభిస్తుంది. విండోస్ 11 హోంతో వస్తుంది. AMD రైజన్ ఏఐ 5 340 చిప్‌సెట్‌తో పాటు AMD రేడియన్ 840M గ్రాఫిక్స్‌కు సపోర్టు ఇస్తుంది. NPU 50 టాప్స్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్ 16GB DDR5 ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. 250 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 85 శాతం స్క్రీన్-టు-బాడీ-రేషియోతో ఫుల్-HD (1,080×1,920 పిక్సెల్) యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

హెచ్‌పీ ఒమినిబుక్ 3 సిరీస్‌లో డ్యూయల్ స్పీకర్లు, ఫింగర్ ప్రింట్ రీడర్ ఉన్నాయి. ఏఐ పీసీ బ్లూటూత్ 5.4, Wi-Fi 6E అందిస్తుంది. డిస్‌ప్లే పోర్ట్ 1.4 సపోర్ట్‌తో USB టైప్-C పోర్ట్, రెండు USB టైప్-A పోర్ట్‌లు, HDMI పోర్ట్, హెడ్‌ఫోన్ మైక్రోఫోన్ కాంబోను కలిగి ఉంది.

ఈ ల్యాప్‌టాప్‌లలో HP ట్రూ విజన్ 1080-పిక్సెల్ ఫుల్-HD కెమెరా ఉంటుంది. ఏఐ ఆధారిత నాయిస్ రిడక్షన్ ఫీచర్‌తో డ్యూయల్ మైక్రోఫోన్లు కలిగి ఉంటుంది. విండోస్ స్టూడియో ఎఫెక్ట్స్ కూడా సపోర్టు ఇస్తుంది. హెచ్‌‌పీ ఒమినిబుక్ 3 సిరీస్‌లో 41Wh బ్యాటరీ ఉంది. 65W పవర్ అడాప్టర్‌తో 45 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.