House loans: గుడ్‌న్యూస్‌.. గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గాయ్.. రుణగ్రహీతల ముందున్న ఆప్షన్స్‌ ఏమిటంటే.

బ్యాంకులు తమ రెపో ఆధారిత గృహ రుణాల వడ్డీ రేట్లనూ పావుశాతం వరకు తగ్గించాయి. ఈ తగ్గింపుతో చాలా మంది రుణ గ్రహీతలు ఊపిరి పీల్చుకున్నారు.

House loans: గుడ్‌న్యూస్‌.. గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గాయ్.. రుణగ్రహీతల ముందున్న ఆప్షన్స్‌ ఏమిటంటే.

home loans

Updated On : March 2, 2025 / 11:02 AM IST

House loans reduced: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే రెపో రేటును 25బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా రెపో రేటును పావుశాతం అంటే 0.25శాతం మేర తగ్గిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. రెపో రేటును 6.50శాతం నుంచి 0.25 శాతానికి తగ్గించింది. ఐదేళ్ల తరువాత వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. దీంతో బ్యాంకులు సైతం డిపాజిట్లతో పాటుగా వివిధ రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి.

 

అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల బ్యాంకులు తమ రెపో ఆధారిత గృహ రుణాల వడ్డీ రేట్లనూ పావుశాతం వరకు తగ్గించాయి. ఈ తగ్గింపుతో చాలా మంది రుణ గ్రహీతలకు ఊరట లభించినట్లయింది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోమ్ లోన్, కారు లోన్ వంటి రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. 25బేసిస్ పాయింట్లు అంటే 0.25 శాతం మేర వడ్డీ రేటును తగ్గించినట్లు తెలిపింది.

అయితే.. తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగా ఈఎంఐల మొత్తం తగ్గించుకోవాలా.. లేక అదే ఈఎంఐలు చెల్లిస్తూ రుణ చెల్లింపు కాలపరిమితి తగ్గించుకోవాలా..? అనే సందేహంలో కొందరు గృహ రుణ గ్రహీతలు ఉన్నారు. పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేని గృహ రుణ గ్రహీతలు అదే ఈఎంఐలతో రుణ చెల్లింపు గడువు తగ్గించుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 

గత నెల 26వ తేదీ నాటికి వివిధ బ్యాంకులు రూ.75 లక్షలకు మించిన రెపో ఆధారిత గృహ రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

ప్రభుత్వ రంగ బ్యాంకులు.. వడ్డీ రేటు (శాతం)
ఎస్‌బీఐ 8.25-9.40
బీఓబీ 8.40-10.65
యూబీఐ 8.10-10.65
పీఎన్‌బీ 8.15-9.90
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 8.30-10.85
కెనరా బ్యాంక్‌ 8.15-10.90
యూకో బ్యాంక్‌ 8.30 నుంచి
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 8.10-10.90
పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ 8.35-9.85
ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 8.15-10.75
ఇండియన్‌ బ్యాంక్‌ 8.15-9.55

 

ప్రైవేట్‌ బ్యాంకులు.. వడ్డీ రేటు (శాతం)
హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్‌ 8.7 నుంచి
ఐసీఐసీఐ బ్యాంక్‌ 8.75 నుంచి
యాక్సిస్‌ బ్యాంక్‌ 8.75-9.65
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 8.75 నుంచి
హెచ్‌ఎ్‌సబీసీ బ్యాంక్‌ 8.5 నుంచి
సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ 8.5 నుంచి
కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ 8.79-9.44
ఫెడరల్‌ బ్యాంక్‌ 8.55 నుంచి
ధనలక్ష్మి బ్యాంక్‌ 8.75 నుంచి
టీఎంబీ 8.60-9.95
బంధన్‌ బ్యాంక్‌ 9.16-13.33
ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 9 నుంచి
సీఎస్బీ బ్యాంక్‌ 10.24-12.09
సిటీ యూనియన్‌ బ్యాంక్‌ 10.15-14.05