Income Tax Return Forms : 2024-25 మదింపు సంవత్సరానికి పన్ను రిటర్న్ ఫారమ్ 1, ఫారమ్ 4 విడుదల.. ఎవరు అర్హులంటే?

Income Tax Return Forms : ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫారమ్‌లు సాధారణంగా మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ప్రకటిస్తారు. అయితే, ఈ సంవత్సరం ఐటీఆర్ ఫారమ్స్ ముందుగానే ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది.

Income Tax Return Forms : 2024-25 మదింపు సంవత్సరానికి పన్ను రిటర్న్ ఫారమ్ 1, ఫారమ్ 4 విడుదల.. ఎవరు అర్హులంటే?

Govt notifies Income Tax Return forms 1, 4 for assessment year 2024-25

Updated On : December 23, 2023 / 8:48 PM IST

Income Tax Return Forms : 2024-25 అసెస్‌మెంట్ (మదింపు) సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌లు  ఐటీఆర్ 1, ఐటీఆర్ 4ను ఆదాయ పన్ను శాఖ విడుదల చేసింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫారమ్‌లను మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఆదాయ పన్ను శాఖ ప్రకటిస్తుంది. అయితే, ఈ సంవత్సరం ఈ ఫారమ్‌లను ముందుగానే ప్రకటించింది. 2024-25 అసెస్‌మెంట్ ఇయర్ (AY) కోసం రూ. 50 లక్షల వరకు వార్షిక మొత్తం ఆదాయం కలిగిన వ్యక్తులు, సంస్థల కోసం ఐటీఆర్ ఫారమ్‌లు 1 ఫారమ్, 4 ఫారమ్ ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ విడుదల చేసింది. హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) సహా వ్యక్తులు రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న సంస్థలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2023-మార్చి 2024) వ్యాపారం, వృత్తి ద్వారా సంపాదిస్తున్నవారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి రిటర్న్‌లను దాఖలు చేయొచ్చు.

ఐటీఆర్ దాఖలకు చివరి తేదీ జూలై 31, 2024 : 
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఐటీఆర్ ఫారమ్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీకి ఏడు నెలల ముందు ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం 2023-24 (మదింపు సంవత్సరం 2024-25) కోసం ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31, 2024గా నిర్ణయించింది. డిసెంబర్ 22, 2023న ఆదాయపు పన్ను శాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది, ఫిబ్రవరి 2023లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి (మదింపు సంవత్సరం 2023-24) ఐటీఆర్ ఫారమ్‌లను ఆదాయపు పన్ను శాఖ జారీ చేసింది. 2023 బడ్జెట్ తర్వాత ఈ ఏడాది ఐటీఆర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2024న ముగియడానికి 3 నెలల ముందు ఫారమ్‌లను విడుదల చేసింది.

Read Also : Income Tax Return : ఆదాయ పన్ను ఇంకా చెల్లించలేదా? ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో ITR ఎలా ఫైల్ చేయాలంటే? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫారమ్‌లు సాధారణంగా మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ప్రకటిస్తారు. అయితే, ఈ ఏడాదిలో ఐటీఆర్ ఫారమ్‌లు డిసెంబర్‌లోనే ప్రకటించింది. ఇది పన్ను చెల్లింపుదారులకు ముందస్తుగా దాఖలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఐటీఆర్ ఫారం 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్) అనేది పెద్ద సంఖ్యలో చిన్న, మధ్యస్థ పన్ను చెల్లింపుదారుల కోసం రూపొందించిన సరళీకృత ఫారమ్‌లుగా చెప్పవచ్చు.

సహజ్, సుగమ్ ఫారమ్స్ ఎవరికి వర్తిస్తాయంటే? :
ఐటీ శాఖ ఈ ఫారమ్‌లను శుక్రవారం (డిసెంబర్ 22న) అధికారికంగా ప్రకటించింది. రూ. 50 లక్షల వరకు ఆదాయం కలిగిన నివాసి వ్యక్తులకు, జీతం, ఇంటి ఆస్తి, ఇతర వనరులు (వడ్డీ), రూ. 5వేల వరకు వ్యవసాయ ఆదాయం నుంచి సంపాదన పొందే వ్యక్తులకు సహజ్ ఫారమ్ వర్తిస్తుంది. అలాగే, సుగమ్ ఫారమ్ అనేది వ్యక్తులు, హెచ్‌యుఎఫ్‌లు, సంస్థలకు పరిమిత బాధ్యత భాగస్వామ్యాలు (ఎల్‌ఎల్‌పిలు) మినహా, వ్యాపారం, వృత్తి ద్వారా వచ్చే ఆదాయంతో సహా మొత్తం ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్న నివాసితులకు వర్తిస్తుంది.

Govt notifies Income Tax Return forms 1, 4 for assessment year 2024-25

Govt notifies Income Tax Return forms 1, 4 for assessment year 2024-25

2023-24 ఆర్థిక సంవత్సరానికి (డిసెంబర్ 17 నాటికి) తాత్కాలిక ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 13,70,388 కోట్లు నికర మొత్తంగా నమోదైనట్టు ఆదాయ పన్నుశాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే.. 20.66 శాతం పెరిగింది. అంటే.. రూ. 11,35,754 కోట్లు ప్రత్యక్ష పన్నులు వసూలు అయ్యాయి.

నికర వసూళ్లలో కార్పొరేషన్ పన్ను (సిఐటి) రూ. 6,94,798 కోట్లు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్‌టీటీ)తో సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) రూ. 6,72,962 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు తాత్కాలిక గణాంకాలు రూ. 15,95,639 కోట్లు, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2022-23)కి సంబంధించిన వసూళ్లపై (17.01 శాతం వృద్ధి)తో రూ. 13,63,649 కోట్లను సాధించింది. గ్రాస్ కలెక్షన్ రూ. 15,95,639 కోట్లు సీఐటీతో కలిపి రూ. 7,90,049 కోట్లు, పీఐటీ సహా ఎస్‌టీటీ రూ. 8,02,902 కోట్లు వసూళ్లను సాధించింది.

Read Also : Samsung Galaxy Z Fold 5 : క్రిస్మస్ సేల్ ఆఫర్లు.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5పై ఏకంగా రూ. 9వేలు తగ్గింపు..