BSNL-MTNL Assets : కేంద్రం కీలక నిర్ణయం.. అమ్మకానికి BSNL, MTNL ఆస్తులు..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన BSNL, MTNL ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. రాష్ట్ర, జిల్లా, ఏరియా కార్యాలయాల స్థలాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.

BSNL-MTNL Assets : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన BSNL, MTNL ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. రాష్ట్ర, జిల్లా, ఏరియా కార్యాలయాల స్థలాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. టెలికం ఆదాయం తగ్గిపోవడంతో ఆస్తులను విక్రయించడం లేదా అద్దెకు ఇచ్చి ఇతర మార్గాల్లో ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తోంది. ఈ రెండు సంస్థల స్థిరాస్తులను ప్రభుత్వం దాదాపు రూ.1,100 కోట్ల రిజర్వ్ ధరకు విక్రయించేందుకు జాబితా చేసింది. హైదరాబాద్, చండీగఢ్, భావ్‌నగర్ కోల్‌కతాలో ఉన్న BSNL ఆస్తులను దాదాపు రూ. 800 కోట్ల రిజర్వ్ ధరకు విక్రయించనుంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) వెబ్‌సైట్‌లో BSNL, MTNL సంస్థల ఆస్తులకు సంబంధించి వివరాల జాబితాను అప్ లోడ్ చేసింది. ఈ డాక్యుమెంట్ల ప్రకారం.. ముంబైలోని వాసరి హిల్, గోరేగావ్‌లో ఉన్న MTNL ఆస్తులను దాదాపు రూ. 270 కోట్ల రిజర్వ్ ధరకు విక్రయించడానికి జాబితా చేసింది. Oshiwaraలో ఉన్న MTNL 20 ఫ్లాట్‌లు కూడా కంపెనీ అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌లో భాగంగా అమ్మకానికి పెట్టింది. అలాగే ఫ్లాట్లలో ఒక గది సెట్, రెండు యూనిట్లు, సింగిల్ బెడ్ రూమ్ హాల్, కిచెన్ (BHK) 17 యూనిట్లు, 2 BHKలో ఒక యూనిట్ ఉన్నాయి.

వాటి రిజర్వ్ ధరలు రూ.52.26 లక్షల నుంచి రూ.1.59 కోట్ల వరకు ఉన్నాయి. MTNL ఆస్తుల ఈ-వేలం డిసెంబర్ 14న జరుగనుంది. అసెట్స్ మానిటైజేషన్ అనేది.. అక్టోబర్ 2019లో ప్రభుత్వం ఆమోదించిన MTNL, BSNL కోసం రూ. 69వేల కోట్ల పునరుద్ధరణ పథకంలో ఒక భాగం.. రెండు ప్రభుత్వ రంగ సంస్థలు 2022 నాటికి రూ. 37,500 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి, మానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సింహభాగం ఉద్యోగులకు VRS ఇచ్చి ఇంటికి పంపించిన BSNL యాజమాన్యం.. దేశవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని భూములను అమ్మకానికి పెట్టింది. ఇందులో హైదరాబాద్ గచ్చిబౌలిలోని 10.96 ఎకరాల స్థలం (44344.16 చదరపు మీటర్లు) విక్రయించనుంది.

Read Also : Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు