GST సంచలన నిర్ణయం : చిరు వ్యాపారులకు బిగ్ రిలీఫ్
చిరు వ్యాపారులకు శుభవార్త. చిన్న వ్యాపారాలపై విధించే జీఎస్టీలో మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.
చిరు వ్యాపారులకు శుభవార్త. చిన్న వ్యాపారాలపై విధించే జీఎస్టీలో మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.
న్యూఢిల్లీ: చిరు వ్యాపారులకు శుభవార్త. చిన్న వ్యాపారాలపై విధించే జీఎస్టీలో మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. గురువారం జీఎస్టీ కౌన్సిల్ 32వ సమావేశంలో ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం వ్యాపారులు ఎవరైనా కానీ రూ.20 లక్షల టర్నోవర్ ఉంటే జీఎస్టీ ఫైల్ చేయాలి. అయితే కొత్త నిర్ణయం ప్రకారం.. ఆ పరిధిని రెట్టింపు అంటే.. రూ.40 లక్షలకు చేసినట్టు జైట్లీ ప్రకటించారు. ఇక నుంచి రూ. 40 లక్షల వరకు టర్నోవర్ ఉండే వ్యాపారులకు జీఎస్టీ నుంచి మినహాయింపు వచ్చింది. చిరు వ్యాపారులు, స్టార్టప్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ రంగాల వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది. మండలి సమావేశం అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఇది రూ.1 కోటి ఉండేదని, దీనిని రూ.1.5 కోట్లకు పెంచామని చెప్పారు. ఈ స్కీమ్ పరిథిలోకి చిన్న వ్యాపారులు వస్తారు. వీరు తమ వ్యాపారాల టర్నోవరును బట్టి తక్కువ పన్ను చెల్లించే అవకాశం ఉంటుంది.
ఈ నిర్ణయాల వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారస్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ.20 లక్షలకు, మిగతా రాష్ట్రాలకు రూ.40 లక్షలకు పెంచినట్లు తెలిపారు. జీఎస్‌టీ కంపోజిషన్ స్కీమ్ పరిథిని కూడా పెంచినట్లు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కంపోజిషన్ స్కీం కింద పరిమితిని రూ. 1.5 కోట్లకు పెంచినట్లు జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ జైట్లీ వెల్లడించారు. గతంలో ఏడాదికి రూ.కోటి లోపు టర్నోవర్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ కంపోజిషన్ స్కీమ్‌లో చేరే అవకాశం ఉండేది. కంపోజిషన్ స్కీమ్ కింద టర్నోవర్‌ను లెక్కించేటప్పుడు ఒకే పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్)తో రిజిస్టర్ అయిన అన్ని వ్యాపారాలను పరిగణనలోకి తీసుకుంటారు. కంపోజిషన్ స్కీం కింద ఉన్న వాళ్లు మూడు నెలలకోసారి పన్ను చెల్లించినా.. రిటర్న్స్ మాత్రం ఏడాదికోసారి ఫైల్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సేవల రంగానికి కూడా కంపోజిషన్ స్కీంను విస్తరిస్తున్నట్లు జైట్లీ తెలిపారు.