HMD Skyline Launch : కొత్త హెచ్ఎండీ స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందోచ్.. యూజర్లు ఇంట్లోనే స్వయంగా రిపేర్ చేసుకోవచ్చు..!

HMD Skyline Launch : హెచ్ఎండీ స్కైలైన్ ప్రత్యేకమైన ఫీచర్లలో ఒకటి. ఈ ఫోన్ రిపేర్ చేయడం ఎంతో సులభం. జెన్2 రిపేరబిలిటీ ఉండటం వల్ల వినియోగదారులు ఇంట్లోనే ఫోన్‌ని తమకు తామే రిపేరింగ్ చేసుకోవచ్చు.

HMD Skyline Launch : కొత్త హెచ్ఎండీ స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందోచ్.. యూజర్లు ఇంట్లోనే స్వయంగా రిపేర్ చేసుకోవచ్చు..!

HMD Skyline, Smartphone that lets users repair it themselves

Updated On : September 17, 2024 / 6:02 PM IST

HMD Skyline Launch : ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ కొత్త స్మార్ట్‌ఫోన్ హెచ్ఎండీ స్కైలైన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ. 35,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ 17 నుంచి ఈ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్ ఇండియా వెబ్‌సైట్, హెచ్ఎండీ వెబ్‌సైట్, రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మొత్తం ట్విస్టెడ్ బ్లాక్, నియాన్ పింక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ప్రత్యేక ఆఫర్‌గా కొనుగోలుదారులు ఫ్రీ 33డబ్ల్యూ టైప్-సి ఫాస్ట్ ఛార్జర్‌ను పొందవచ్చు.

రిపేర్లు చేయడం సులభం :
హెచ్ఎండీ స్కైలైన్ ప్రత్యేకమైన ఫీచర్లలో ఒకటి. ఈ ఫోన్ రిపేర్ చేయడం ఎంతో సులభం. జెన్2 రిపేరబిలిటీ ఉండటం వల్ల వినియోగదారులు ఇంట్లోనే ఫోన్‌ని తమకు తామే రిపేరింగ్ చేసుకోవచ్చు. కేవలం ఒక స్క్రూను తిప్పడం ద్వారా, బ్యాక్ కవర్‌ను తొలగించి బ్యాటరీ వంటి ఫోన్ పార్టులను యాక్సెస్ చేయవచ్చు.

Read Also : iPhone 17 Leaks : ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. కెమెరా, డిస్‌ప్లే, చిప్‌సెట్ వివరాలు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఈ డిజైన్ యూజర్లకు ముఖ్యంగా జెన్ జెడ్ సొంతంగా రిపేర్ చేయగల డివైజ్‌లను ఇష్టపడతారు. హెచ్ఎండీ స్కైలైన్ బ్యాటరీ మన్నికగా తయారైంది. సింగిల్ ఛార్జ్‌పై 48 గంటల వరకు పనిచేస్తుంది. 800 ఫుల్ ఛార్జ్‌ల తర్వాత కూడా సామర్థ్యాన్ని 80శాతం కలిగి ఉంటుంది. ఈ హెచ్ఎండీ ఫోన్ క్యూఐ2 కస్టమ్ ఛార్జర్‌లతో వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. పవర్ అప్ చేసేందుకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

హెచ్ఎండీ స్కైలైన్ స్పెసిఫికేషన్‌లు :
హెచ్ఎండీ స్కైలైన్ ఫొటోగ్రఫీ కోసం రూపొందించింది. 108ఎంపీ ఓఐఎస్ హైబ్రిడ్ ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 13ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ తక్కువ వెలుతురులో కూడా హై క్వాలిటీ ఫోటోలకు క్యాప్చర్ ఫ్యూజన్, నైట్ మోడ్ 3.0, 4ఎక్స్ ఆప్టికల్ జూమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. సెల్ఫీల కోసం వినియోగదారులు సెల్ఫీ గెచర్స్ ఉపయోగించవచ్చు. పోర్ట్రెయిట్ మోడ్ వారికి సహజమైన బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌తో ఆకర్షణీయమైన షాట్‌లను అందిస్తుంది.

స్పాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. హెచ్ఎండీ స్కైలైన్ యాప్‌లు, గేమ్‌ల కోసం సున్నితమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. యూజర్ల అన్ని అవసరాలకు 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. అదనంగా, ఫోన్ 5జీకి సపోర్టు ఇస్తుంది. వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది.

6.7-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10 సపోర్టుతో సున్నితమైన స్పష్టమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. స్టీరియో స్పీకర్‌లతో వీడియోలు లేదా గేమింగ్‌లను వీక్షించవచ్చు. హెచ్ఎండీ స్కైలైన్ అధునాతన కెమెరా ఫీచర్లు, సులభమైన రిపేరబిలిటీని అందిస్తుంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, సౌలభ్యం రెండింటినీ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Reliance Jio Down : స్తంభించిన జియో నెట్‌వర్క్.. వేలాది యూజర్లపై ఎఫెక్ట్.. ఎట్టకేలకు ఫిక్స్ చేసిందిగా..!