Home loan rate
Home Loan : సొంతింటి కల నిజం అనుకుంటున్నారా? ఆర్బీఐ విధానాలతో హోం లోన్లు తక్కువ వడ్డీలకే అందిస్తున్నాయి. ప్రస్తుత ఏడాదిలో ఆర్బీఐ ఇప్పటికే రెండు సార్లు రెపో రేటును తగ్గించింది.
మొత్తం 50 బేసిస్ పాయింట్లు తగ్గింపుతో రెపోరేటు 6.5శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8 శాతం కన్నా తక్కువకు పడిపోయింది. చాలా టాప్ బ్యాంకులు 8 శాతం వడ్డీకే హోం లోన్ అందిస్తున్నాయి.
Read Also : Moto G85 5G : ఇది కదా డిస్కౌంట్ అంటే.. మోటో G85 5Gపై ఖతర్నాక్ ఆఫర్.. బ్యాంకు ఆఫర్లతో తక్కువ ధరకే..!
ఈ వడ్డీ రేట్లు అర్హత గల రుణగ్రహీతలకు మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితుల బ్యాంకుల విధానాల ఆధారంగా మారవచ్చు.
సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండే వారికి బ్యాంకులు ఎక్కువ వడ్డీకి లోన్లు ఇస్తాయి. హోమ్ లోన్ ఈఎంఐలో అసలు, వడ్డీ ఉంటాయి. టేబుల్‌లో 20 ఏళ్ల కాలానికి రూ.30 లక్షల లోన్ వడ్డీ, ఈఐఎం వివరాలు అందుబాటులో ఉన్నాయి.
క్రెడిట్ స్కోర్ :
మీ లోన్ అర్హత కోసం బ్యాంకులు క్రెడిట్ స్కోర్లను చెక్ చేస్తాయి. 750 స్కోరు కన్నా ఎక్కువ క్రెడిట్ స్కోర్ గుడ్ అంటారు. 750 కన్నా తక్కువ క్రెడిట్ స్కోర్ నెగటివ్ భావిస్తారు. మీ క్రెడిట్ స్కోర్ సగటు కన్నా తక్కువగా ఉంటే.. బ్యాంకులు ఎక్కువ వడ్డీని వసూలు చేయొచ్చు.
బెంచ్ మార్క్ రేట్లు :
ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉంటే.. బెంచ్ మార్క్ రేటులో కూడా ఏదైనా మార్పు ఉండొచ్చు. మీ హోమ్ లోన్ వడ్డీ రేటుపై ప్రభావం పడుతుంది. బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఎక్స్‌ట్రనల్ బెంచ్ మార్కు లింక్ చేయాలని ఆర్బీఐ 2019 అక్టోబరులో కోరింది.
ఈఎంఐని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తుంది.
బ్యాంకులు సెప్టెంబర్ 30, 2019 నుంచి ఇచ్చిన లోన్లు MLCR ప్రకారం అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత రుణగ్రహీతలు కూడా ఎక్స్ టర్నల్ బెంచ్ మార్కింగ్ లోన్ విధానానికి మారేందుకు అవకాశం ఉంది.
ఫిక్స్‌డ్ లేదా ఫ్లోటింగ్ రేటు :
ఫిక్స్‌డ్ రేటు, ఫ్లోటింగ్ రేటు హోమ్ లోన్లకు వేర్వేరు రకాల వడ్డీలు ఉంటాయి. ఫిక్స్‌డ్ లోన్లపై వడ్డీ సాధారణంగా ఫ్లోటింగ్ రేటు లోన్లు అందించే రేట్ల కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫ్లోటింగ్ రేటు లోన్లు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారే అవకాశం ఉంటుంది.
మొత్తం లోన్ :
హోమ్ లోన్ తీసుకున్న లోన్ మొత్తం బ్యాంకు అందించే వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది. సాధారణంగా, పెద్ద మొత్తంలో లోన్లపై అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. చిన్న లోన్లపై తక్కువ రేట్లు ఉండవచ్చు.
ప్రాపర్టీ ప్రాంతం :
రీసేల్ వాల్యూ ఉండే ప్రాంతంలో ఇల్లు కొంటే.. బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును వసూలు చేయవచ్చు. తక్కువగా రీసేల్ ఉండే ప్రాంతంలో ఇళ్లకు వడ్డీ ఎక్కువగా ఉండవచ్చు.