Honda Elevate : హోండా ఎలివేట్ మిడ్ సైజ్ SUV మోడల్ మైలేజీ, బుకింగ్ వివరాలు ఇవే..!

Honda Elevate : ప్రముఖ హోండా కార్స్ (Honda Elevate) భారత్‌లో హోండా ఎలివేట్ మిడ్-సైజ్ SUVతో రెడీ అవుతోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్-పోటీదారు నుంచి ఇప్పటికే బుకింగ్‌లు మొదలయ్యాయి.

Honda Elevate mileage figures revealed, get details here

Honda Elevate : ప్రముఖ హోండా కార్స్ (Honda Elevate) భారత్‌లో హోండా ఎలివేట్ మిడ్-సైజ్ SUVతో రెడీ అవుతోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్-పోటీదారు నుంచి ఇప్పటికే బుకింగ్‌లు మొదలయ్యాయి. జపనీస్ ఆటో దిగ్గజం లేటెస్ట్ మోడల్ గురించి మైలేజీకి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను రివీల్ చేసింది.

హోండా ఎలివేట్ పవర్‌ట్రెయిన్ :
హోండా ఎలివేట్ 121PS గరిష్ట శక్తిని 145Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ i-VTEC DOHC పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగిస్తుంది. ఇంజిన్‌ను 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ CVT ఆటోమేటిక్‌తో పెయిర్ చేయవచ్చు. హోండా ఎలివేట్‌లో ఎలాంటి హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను ప్రవేశపెట్టడం లేదు.

హోండా ఎలివేట్ మైలేజీ :
హోండా ఎలివేట్ MT మైలేజ్ లీటరుకు 15.31కిలోమీటర్లు, హోండా ఎలివేట్ CTVకి 16.92 కి.మీ అందిస్తుంది.

Read Also : Honda Elevate Bookings : కొత్త కారు కావాలా? హోండా ఎలివేట్ బుకింగ్స్ ఓపెన్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి.. సెప్టెంబర్‌లోనే లాంచ్!

హోండా ఎలివేట్ టాప్ స్పీడ్ :
హోండా ఎలివేట్ గరిష్టంగా 160kmph స్పీడ్ అందిస్తుంది.

హోండా ఎలివేట్ లాంచ్ :
సెప్టెంబర్‌లో హోండా ఎలివేట్ భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు.

హోండా ఎలివేట్ బుకింగ్స్ :
హోండా ఎలివేట్ బుకింగ్‌లను ప్రారంభించింది. హోమ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ నుంచి హోండా డీలర్‌షిప్‌లు, హోండా ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ మొత్తాన్ని రూ.21వేలగా నిర్ణయించారు.

Honda Elevate mileage figures revealed, get details here

హోండా ఎలివేట్ వేరియంట్లు :
ఎలివేట్ SV, V, VX, ZX 4 వేరియంట్‌లలో లభిస్తుంది. MT ఆప్షన్ మొత్తం 4 వేరియంట్‌లతో పొందవచ్చు, అయితే CVT ఆప్షన్ మొదటి మూడు V, VX, ZX లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

హోండా ఎలివేట్ ఫీచర్లు :
ఎలివేట్ LED DRL, LED టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఫుల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, 17-అంగుళాల డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను పొందుతుంది. క్యాబిన్ లోపల 7-అంగుళాల HD కలర్ TFT MID, 10.25-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ని పొందవచ్చు. హోండా సెన్సింగ్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) సూట్ అందిస్తుంది.

హోండా ఎలివేట్ ధర :
ఎలివేట్ ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉంటుంది.

హోండా ఎలివేట్ పోటీదారులు :
హోండా ఎలివేట్ పోటీదారుగా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లోకి ప్రవేశిస్తోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైర్డర్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, MG ఆస్టర్ వంటి పోటీగా ఉంటుంది.

Read Also : IRCTC Mobile App : ఐఆర్‌సీటీసీ యాప్‌లో సాంకేతిక లోపం.. ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే?

ట్రెండింగ్ వార్తలు