IRCTC Mobile App : ఐఆర్‌సీటీసీ యాప్‌లో సాంకేతిక లోపం.. ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే?

IRCTC Mobile App : ప్రముఖ ఐఆర్‌సీటీసీ (IRCTC) టికెటింగ్ సర్వీసులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఐఆర్‌సీటీసీ (IRCTC) టికెటింగ్ సర్వీసులో ప్రస్తుతం బహిర్గతం కాని సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయింది. రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే యూజర్లపై ప్రభావితం చేస్తుంది.

IRCTC Mobile App : ఐఆర్‌సీటీసీ యాప్‌లో సాంకేతిక లోపం.. ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే?

IRCTC Website, Mobile App not working _ what is the reason and how to book train tickets online

IRCTC Mobile App : ప్రముఖ ఐఆర్‌సీటీసీ (IRCTC) టికెటింగ్ సర్వీసులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఐఆర్‌సీటీసీ (IRCTC) టికెటింగ్ సర్వీసులో ప్రస్తుతం బహిర్గతం కాని సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయింది. రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే యూజర్లపై ప్రభావితం చేస్తుంది. అమెజాన్ Amazon (MakeMyTrip) వంటి థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించమని అధికారులు సిఫార్సు చేస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) డౌన్ అయింది. ట్విట్టర్ (ఇప్పుడు X) ద్వారా వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ అప్లికేషన్ డౌన్‌టైమ్‌ను అధికారులు ధృవీకరించారు. టెక్నికల్ కారణాల వల్ల ప్లాట్‌ఫారమ్ డౌన్ అయిందని (IRCTC) పోస్ట్‌లో వెల్లడించింది. అయినప్పటికీ, కచ్చితమైన టెక్నికల్ సమస్య ఇంకా వెల్లడి కాలేదు. కానీ, సాంకేతిక సమస్యల కారణంగా టికెటింగ్ సర్వీస్ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

Read Also : WhatsApp iPhone Users : ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ అదిరే అప్‌డేట్.. 5 సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఇవే..!

అంతకుముందు, IRCTC ట్వీట్‌లో టెక్నికల్ కారణాల వల్ల టికెటింగ్ సర్వీసు అందుబాటులో లేదు. ప్రస్తుతం టెక్నికల్ బృందం సమస్యను పరిష్కరిస్తోంది. సాంకేతిక సమస్య పరిష్కరించిన వెంటనే తెలియజేస్తామన్నారు. కొన్ని నిమిషాల తర్వాత ప్లాట్‌ఫారమ్ కూడా టెక్నికల్ కారణాల వల్ల IRCTC సైట్, యాప్‌లో టికెటింగ్ సర్వీసు అందుబాటులో లేదు. CRIS టెక్నికల్ బృందం సమస్యను పరిష్కరిస్తోంది. రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ప్లాట్‌ఫారమ్ త్వరలో అందుబాటులోకి రానుంది.

ప్రత్యామ్నాయంగా, వినియోగదారులు Amazon, MakeMyTrip, ఇతర B2B ప్లేయర్‌ల వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా అమెజాన్, మేక్‌మైట్రిప్ వంటి ఇతర B2C ప్లేయర్‌ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని పోస్ట్ పేర్కొంది. Amazon, MakeMyTrip ఇతర థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి రైలు టిక్కెట్‌లను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

IRCTC Website, Mobile App not working _ what is the reason and how to book train tickets online

IRCTC Website, Mobile App not working _ what is the reason and how to book train tickets online

ముందుగా, రైలు టికెట్ సెక్షన్‌కు వెళ్లండి. మీ ప్రయాణ వివరాలను రిజిస్టర్ చేయండి. మీరు బయలుదేరే నగరం, గమ్యస్థాన నగరం, తేదీ, ట్రావెల్ టైమ్ ఎంటర్ చేయాలి. మీకు వన్-వే టికెట్ కావాలా లేదా రిటర్న్ టిక్కెట్ కావాలి? ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రైన్ ఎంచుకోండి :  ఆన్‌లైన్ వెబ్‌సైట్ల ద్వారా మీకు అందుబాటులో ఉన్న రైళ్లను చెక్ చేసుకోవచ్చు. మీరు బయలుదేరే సమయం, ప్రయాణ వ్యవధి, ధర ఆధారంగా ఏదైనా ట్రైన్ ఎంచుకోవచ్చు.

మీ సీటును ఎంచుకోండి : కొన్ని సర్వీసుల్లో మీ సీటును ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఇతరులు ఆటోమేటిక్‌గా మీకు సీటు కేటాయిస్తారు.

పేమెంట్ చేయండి : మీ పేమెంట్ వివరాలను ఎంటర్ చేయండి. కొనుగోలును పూర్తి చేయండి.

నిర్ధారణ : మీరు మీ టిక్కెట్ వివరాలతో Confirmation ఇమెయిల్‌ను అందుకుంటారు. మీ స్మార్ట్‌ఫోన్‌లో చూపించే మొబైల్ టిక్కెట్‌ను కూడా కొన్ని సర్వీసుల ద్వారా పొందవచ్చు.

Read Also : Amazon Employees : అమెజాన్ కొత్త వర్క్ పాలసీ.. వస్తే రండి.. పోతే పోండి.. వారంలో 3 రోజులు ఆఫీసులో పనిచేయాల్సిందే..!