Honda CB350
Honda CB350 Launch : కొత్త బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రముఖ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) నుంచి మూడు సరికొత్త బైకులు మార్కెట్లో లాంచ్ చేసింది.
2025 CB350, CB350 H’ness, CB350RS అనే ఈ మోడల్ బైకులను కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది. ఈ కొత్త హోండా బైకులు మిడ్-సైజ్ ప్రీమియం మోటార్‌సైకిల్ లైనప్‌ను విస్తరించింది. ఈ 3 మోడళ్లు ఇప్పుడు రెట్రో-మోడరన్ స్టైలింగ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
పవర్‌ఫుల్ కొత్త కలర్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. 348.36cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ BSVI OBD2B-కంప్లైంట్ PGM-FI ఇంజిన్‌తో నడిచే ఈ మోటార్‌సైకిళ్లు 5,500rpm వద్ద 15.5kW పవర్ అందిస్తాయి. CB350 H’ness, CB350RS 3వేల ఆర్పీఎమ్ వద్ద 30Nm పీక్ టార్క్‌ను అందిస్తాయి. అయితే, CB350 అదే RPM వద్ద 29.5Nm ఉత్పత్తి చేస్తుంది. ఈ మూడు బైక్‌లు E20 ఫ్యూయల్-కంప్లైంట్, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.
వేరియంట్ వారీగా ధర, కలర్ ఆప్షన్లు :
హోండా CB350 :
DLX, DLX PRO : మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్, రెబెల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే
ధర : రూ. 2,15,500 నుంచి రూ. 2,18,850 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
హోండా CB350 H’ness :
DLX : పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్
DLX PRO : రెబెల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే
DLX PRO క్రోమ్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్
ధర : రూ. 2,10,500 నుంచి రూ. 2,15,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
హోండా CB350RS :
DLX : పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే
DLX PRO : రెబెల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్
ధర : రూ. 2,15,500 నుంచి రూ. 2,18,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
Read Also : SIP Investment : మీ జీతం రాగానే ఇలా చేయండి.. కేవలం రూ. 9వేల పెట్టుబడితో 20ఏళ్లలో లక్షాధికారి అవ్వొచ్చు..!
హోండా CB350 సిరీస్ ఇప్పుడు భారత మార్కెట్లోని అన్ని హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.