SIP Investment : మీ జీతం రాగానే ఇలా చేయండి.. కేవలం రూ. 9వేల పెట్టుబడితో 20ఏళ్లలో లక్షాధికారి అవ్వొచ్చు..!
SIP Investment : పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? మీ జీతం డబ్బులను SIPలో పెట్టుబడి పెట్టండి. నెలకు రూ.9వేల పెట్టుబడితో 20ఏళ్లలో లక్షల డబ్బులను సంపాదించవచ్చు.

investing in mutual fund SIP
SIP Investment : మీకు జీతం పడిందా? అయితే, ఇప్పుడే ఆ డబ్బులను ఏదైనా పెట్టుబడి కోసం వినియోగించండి. భవిష్యత్తులో ఈ డబ్బే మీకు అండగా నిలుస్తుంది. ప్రస్తుత రోజుల్లో SIPలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. మీరు ఇప్పటివరకు SIPలో పెట్టుబడి పెట్టకపోతే ఇప్పుడే ప్రారంభించండి.
ఎందుకంటే SIPలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు కేవలం 20 ఏళ్లలో లక్షాధికారి కావచ్చు. రూ. 9వేల పెట్టుబడితో లక్షల నుంచి కోట్లు వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. SIPలో పెట్టుబడి పెట్టడం ద్వారా లక్షల డబ్బు ఎలా సంపాదించవచ్చు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవాలని భావిస్తుంటారు. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా కేవలం 20 సంవత్సరాలలో లక్షల ఆదాయం పొందవచ్చు. అయితే, సరైన పెట్టుబడి మొత్తాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమని గమనించాలి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కింద మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మాత్రమే కాదు, మార్కెట్ డిమాండ్ ప్రకారం.. యూనిట్లను కూడా కొనుగోలు చేస్తారు. రెగ్యులర్, లాంగ్ టైమ్ పెట్టుబడుల ద్వారా కాంపౌండింగ్ అద్భుతమైన ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే, SIPలో పెట్టుబడి పెట్టే వారికి ఓపిక ఉంటే.. కోట్ల విలువైన డబ్బును క్రియేట్ చేయొచ్చు. మీరు SIP ద్వారా ప్రతి నెలా రూ.9వేలు పెట్టుబడి పెడితే మీరు లక్షాధికారి కావచ్చు.
15శాతం రాబడితో ఎంతంటే? :
ఈ పెట్టుబడిపై మీరు సగటున 15శాతం వార్షిక రాబడిని పొందవచ్చు. లాంగ్ టైమ్‌లో లక్షాధికారిని చేస్తుంది. కానీ, సగటు రాబడి 20 శాతం ఉంటే.. మరింత డబ్బును సంపాదించే అవకాశం ఉంటుంది. మీరు ప్రతి నెలా మీ ఆదాయం నుంచి రూ.9వేలు SIP చేస్తే.. రాబోయే 20 ఏళ్లలో మీరు కోట్ల విలువైన డబ్బులను సంపాదించవచ్చు. ఈ పెట్టుబడిపై మీరు సగటున 15 శాతం రాబడిని పొందితే.. రూ. 1 కోటి కన్నా ఎక్కువ సంపాదించవచ్చు.
20శాతం రాబడితో ఎంతంటే? :
మీరు 15శాతం రేటుతో 20 ఏళ్లకు రూ. 9వేలు పెట్టుబడి పెడితే పెట్టుబడి మొత్తం రూ. 21,60,000 అవుతుంది. మీరు రూ. 97,83,661 రాబడిని పొందవచ్చు. దీని ప్రకారం.. SIP మొత్తం రూ. 1,19,43,661 అవుతుంది. మీరు రూ. 9వేల పెట్టుబడిపై 20శాతం రాబడిని పొందితే.. రూ. 2.22 కోట్లకు పెరుగుతుంది.
మీరు 20 శాతం రేటుతో 20 ఏళ్ల పాటు రూ. 9వేలు పెట్టుబడి పెడితే పెట్టుబడి మొత్తం రూ. 21,60,000 అవుతుంది. మీకు రూ. 2,01,25,746 రాబడి లభిస్తుంది. దీని ప్రకారం.. మొత్తంగా రూ. 2,22,85,746 అవుతుంది.