Honda Shine 100
Honda Shine 100 : కొత్త బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. మీరు కూడా 100cc హోండా బైక్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ ఛాయిస్.. ఈ బైక్ మైలేజ్, పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. హోండా క్రేజీ లుక్‌తో వస్తుంది. అత్యంత సరసమైన ధర బైక్ కూడా ఇదే. మీరు హోండా అభిమాని అయితే ఈ బైక్ మైలేజ్, ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చెక్ చేసి కొనేసుకోండి.
హోండా షైన్ 100 ఫీచర్లు :
ఫీచర్లు, డిజైన్ విషయానికి వస్తే.. హోండా షైన్ 100 పూర్తిగా నో-ఫ్రిల్స్ డిజైన్‌ను కలిగి ఉంది. పాపులర్ షైన్ 125 DNA కలిగి ఉంటుంది. కాంపాక్ట్ రూపంలో ఉంటుంది. క్లీన్ లైన్లు, హెడ్‌ల్యాంప్ యూనిట్, ఇంటిగ్రేటెడ్ టెయిల్ సెక్షన్‌తో షైన్ 100 రోజువారీ రైడర్‌ల కోసం బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు.
హోండా షైన్ 100 ఇంజిన్, పవర్ :
హోండా బైక్ ట్యాంక్ కింద 98cc 4 స్ట్రోక్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇంజిన్ 7.38 పిఎస్ పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అద్భుతమైన లో-ఎండ్ టార్క్, స్మూత్ పవర్ డెలివరీ కోసం ట్యూన్ అయింది. స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌కు బైక్ అనువైనది. కంపెనీ ఈ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందిస్తుంది. ఈ బైక్ సిటీ డ్రైవింగ్ కోసం తయారైంది.
హోండా షైన్ 100 మైలేజ్ :
హోండా షైన్ అత్యుత్తమ మైలేజ్ బైక్. అందుకే మిడిల్ క్లాస్ వినియోగదారులు ఈ బైక్‌ను తెగ ఇష్టపడతారు. మైలేజ్ విషయానికి వస్తే.. ఈ బైక్ మీకు 55 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. మంచి వేగంతో బైక్‌ను నడిపితే ఎక్కువ మైలేజీని కూడా అందిస్తుంది.
Read Also : Realme C75 5G : రియల్‌మి లవర్స్‌కు పండగే.. కొత్త రియల్‌మి 5G ఫోన్ చూశారా? ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
హోండా షైన్ 100 ధర ఎంతంటే? :
హోండా షైన్ బైక్ ధర విషయానికి వస్తే.. 66,928 వేల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై 68,794 వేల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ బైక్ ధర స్మార్ట్ డిస్‌ప్లేతో అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. భారత మార్కెట్లో మల్టీ వేరియంట్లలో ఈ బైక్ అందుబాటులో ఉంది.