Honda SP 125 : మిడిల్ క్లాసు మెచ్చే హోండా బైక్ భలే ఉందిగా.. కేవలం మీ బడ్జెట్ ధరలోనే.. 60కి.మీ మైలేజీ తగ్గేదేలే..!

Honda SP 125 : మధ్యతరగతి వాళ్లు ఇష్టపడే బైకుల్లో హోండా SP 125 ఒకటి. ఈ బైక్ మార్కెట్లో ఎంత పాపులర్ అంటే.. సరసమైన ధరలో లభించే బైకులలో ఇది పక్కగా ఉంటుంది.

Honda SP 125 : మిడిల్ క్లాసు మెచ్చే హోండా బైక్ భలే ఉందిగా.. కేవలం మీ బడ్జెట్ ధరలోనే.. 60కి.మీ మైలేజీ తగ్గేదేలే..!

Honda SP 125 Affordable Bike

Updated On : April 4, 2025 / 12:21 PM IST

Honda SP 125 : కొత్త బైక్ కొంటున్నారా? అయితే, మిడిల్ క్లాస్ వినియోగదారుల కోసం హోండా మోటార్స్ అద్భుతమైన బైకును అందిస్తోంది. మధ్యతరగతి ప్రజల బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో హోండా బైక్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. హోండా అందించే పాపులర్ బైక్‌లలో హోండా SP 125 అనేది బెస్ట్ సెగ్మెంట్ బైక్.

Read Also : Infinix Note 40X 5G : వావ్.. స్పెషల్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఇన్ఫినిక్స్ 5G ఫోన్.. ఫీచర్ల కోసమైనే కొనేసుకోవచ్చు!

ఈ హోండా SP 125 బైక్ క్రేజే వేరు. ఈ మోటార్‌సైకిల్ రోజువారీ ప్రయాణానికి, అప్పుడప్పుడు లాంగ్ రైడ్‌ల కోసం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. హోండా SP మోడల్‌కు మార్కె్ట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ హోండా బైక్ కొనుగోలు చేస్తే లీటర్‌కు60కి.మీ మైలేజీని ఇస్తుంది. హోండా SP 125 బైక్ ఫీచర్లు, ధర పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..

హోండా SP 125 స్పెసిఫికేషన్లు :
హోండా ఫీచర్ల విషయానికి వస్తే.. హోండా SP 125 అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. డిజిటల్ ఓడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ టాకోమీటర్, ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్, LED హెడ్‌లైట్లు, టర్న్ సిగ్నల్ లాంప్స్ ఉన్నాయి. ఈ బైక్‌లో మీకు లభించే ఇండికేటర్ వంటి ఫీచర్లను మిడిల్ క్లాస్ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడతారు. హోండా SP 125 ఎంతో సౌకర్యవంతమైన బైక్.. ఇంజిన్‌ పరంగా ఈ బైక్ ఇంటర్నల్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది.

హోండా SP 125 పర్ఫార్మెన్స్, ఇంజిన్ మైలేజ్ :
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. హోండా SP 125 కంపెనీకి 124cc, 4 స్ట్రోక్ ఇంజిన్ కలిగి ఉంది. 10.7ps అద్భుతమైన పవర్, 10.9Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అమర్చి ఉంది. కంపెనీ 11 లీటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. ఈ బైక్‌ ఒక లీటర్‌కు 63కి.మీ మైలేజీని ఇస్తుంది. ఈ రేంజ్‌లో మీరు పొందే అద్భుతమైన పవర్‌ఫుల్ బైక్ ఇదేనని చెప్పవచ్చు.

Read Also : Garmin Smartwatches : వారెవ్వా.. అడ్వెంచర్ ప్రియుల కోసం అద్భుతమైన గార్మిన్ స్మార్ట్‌వాచ్‌‌లివే.. ఫీచర్లు మాత్రం హైలెట్..!

హోండా SP 125 ధర ఎంతంటే? :
ఈ హోండా SP 125 బైక్ అనేక వేరియంట్లలో లభిస్తుంది. హోండా బైక్ ధర రూ. 92,110 నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమై రూ. లక్ష వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ ధర ఒకేలా ఉంటుంది. ఎందుకంటే.. ఎక్స్-షోరూమ్ ధరకే కొనాలని ఉంటుంది. హోండా కంపెనీ ఈ బైక్‌ను మధ్యతరగతి ప్రజల కోసమే తయారుచేసింది. ఈ బైక్ ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్‌లను కూడా అందిస్తుంది.