డబ్బుంది.. ఇన్వెస్ట్ మెంట్ కింద ఇల్లు కొందామనుకునే వారికోసం..

House Invest : ఇంటిపై పెట్టుబడి పెట్టడం అనేది మంచి నిర్ణయమా? ఇలా కొనుగోలు చేస్తే కలిగే లాభానష్టాలు ఉంటాయా? పూర్తి వివరాలు తెలుసుకోండి.

House Invest

House Invest : ఇల్లు అనేది ప్రతిఒక్కరి డ్రీమ్.. సొంత ఇంటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, కొందరు మాత్రమే ఆ ఇంటి కలను నెరవేర్చుకుంటారు.

ఇంటి అవసరం ఉన్నా లేకున్నా ధరలు పెరిగిపోతున్నాయని ఇంటిని కొనుగోలు చేస్తుంటారు మరికొందరు. ఇంటిని ఒక పెట్టుబడిగానే చూస్తుంటారు. అద్దెల ద్వారా బాగా సంపాదించు కోవచ్చునని భావిస్తుంటారు.

Read Also : iPhone 17 Pro Max : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. డిజైన్, ధర, కెమెరా ఫీచర్లు ఇవేనా..?

కేవలం పెట్టుబడి కోసమే ఇంటిని కొనుగోలు చేయడంపై మార్కెట్ విశ్లేషకులు సరైన నిర్ణయం కాదని చెబుతున్నారు. ఇల్లు ఒక నివాసంగా మాత్రమే భావించాలని, పెట్టుబడి దృష్ట్యా కొనుగోలు చేయడం సరికాదని అంటున్నారు. ఎవరైనా ఇల్లు కొనుగోలు చేసి అందులో ఉంటే పర్వాలేదు. ఆ ఇల్లు విలువ పెరిగినా తగ్గినా పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.

ఇంటిపై పెట్టుబడితో కలిగే నష్టాలేంటి? :
మీరు కొనే ఇల్లు కేవలం పెట్టుబడి కోసమే అయితే కొన్ని లాభానష్టాలను తెలుసుకోవడం ఎంతైనా మంచిది. రియల్ ఎస్టేట్ పరంగా కొన్ని నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇల్లు పరంగా పెట్టుబడికి అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తుంది.

మిగతా వాటితో చూస్తే.. లిక్విడిటీ చాలా తక్కువ. అవసరమైనప్పుడు ల్యాండ్ మాదిరిగా విక్రయించే వీలుండదు. మార్కెట పరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కొంతమంది కొనుగోలు చేసిన ఇంటిని అద్దెకు ఇస్తుంటారు. ఇలా చేస్తే అద్దెల రూపంలో కొంత ఆదాయం పొందవచ్చు. అందుకే ఇంటిని కొనడం అనేది ఒక పెట్టుబడిగా భావిస్తుంటారు. ద్రవ్యోల్బణం పెరిగినా కొద్ది అద్దెలు కూడా భారీగా పెరుగుతాయి.

ఇల్లు పాతదైతే అద్దెలు తగ్గొచ్చు :
కానీ, ఇందులో కొన్ని నష్టాలు కూడా లేకపోలేదు. ఇంటిని కొనుగోలు చేసిన సమయంలో దాని విలువ బాగానే ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత ఆ ఇల్లు పాతదిగా మారుతుంది. రానురాను అద్దె కూడా తగ్గించాల్సి వస్తుంది.

కొన్న కొత్తలో వచ్చినంత అద్దెలు రాకపోవచ్చు. కిరాయిదారులు అంత అద్దెపెట్టి పాత ఇంట్లో ఉండేందుకు ఇష్టపడరు. ఎక్కడ కొత్త ఇల్లు ఉంటే అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్ ఆధారంగా ఇంటి వాల్యూ పెరగొచ్చు.. కానీ, అద్దె వాల్యూ మాత్రం పడిపోతూ వస్తుంది.

Read Also : Samsung Galaxy S23 Plus 5G : కొత్త ఫోన్ కావాలా? ఈ శాంసంగ్ 5G ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ మీకోసమే..!

అందుకే ఇంటిని ఎప్పుడూ నివాసయోగ్యంగానే చూడాలే తప్పా పెట్టుబడి కోసం అసలు తీసుకోకూడదు. ఇంటిని కొనేముందు ఈ విషయాల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండటం ఎంతైనా మంచిది.