హైదరాబాద్‌లో గణనీయంగా ఇళ్ల ధరల పెరుగుదల.. ఆలస్యం చేస్తే ఇంకా పెరుగుతాయ్!

హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంది. భూముల ధరలతోపాటు ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ధరలు ఎక్కువగా పెరిగాయి.

housing price rise continues in hyderabad what real estate experts suggest

Hyderabad housing price rise : కొత్త సంవత్సరంలో ఇళ్ల ధరలు మరింత పెరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి నిర్మాణ సంస్థలు. పలు నిర్మాణ సంస్థలు ధరలను సవరించబోతున్నాయి. దీంతో భూముల ధరలతోపాటు ఇళ్ల ధరల్లోనూ మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటికే స్థలాలపై ఇస్తున్న రాయితీలు ముగుస్తాయని.. ఈలోపే బుక్ చేసుకోవాలని స్థిరాస్తి సంస్థలు కోరుతున్నాయి. నచ్చిన ఇల్లు దొరక్క, బడ్జెట్ సహకరించక స్థిరాస్తి కొనుగోలును చాలా మంది వాయిదా వేస్తుంటారు. కొనుగోలు ఆలస్యమయ్యేకొద్దీ ధరలు మరింత పెరగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కన్‌స్ట్రక్షన్‌ కాస్ట్‌ పెరిగి..
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంది. భూముల ధరలతోపాటు ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ధరలు ఎక్కువగా పెరిగాయి. గ్రేటర్‌లో కిందటేడాది ఇదే సమయంతో పోలిస్తే 19 శాతం ధరలు పెరిగాయి. నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఆ ప్రభావం ఇంటి ధరలపై పడుతోంది. అంతే కాకుండా ఇంటి నిర్మాణానికి కావాల్సిన స్టీల్, సిమెంట్ తదితర ధరలు పెరగడంతో కన్‌స్ట్రక్షన్‌ కాస్ట్‌ పెరిగిపోయింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రెండేళ్ల క్రితం 25 లక్షల్లో ఇల్లు దొరికేవి. కానీ ఇప్పుడు కనీసం 45 లక్షల రూపాయలుంటేనే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ వస్తుంది. రానున్న రోజుల్లో ఈ రేంజ్ మరింత పెరిగిపోయి 60 నుంచి 80 లక్షల కనీసం ధరలకు ఇంటి రేంజ్ పెరిగే అవకాశం ఉంది.

ఇళ్లకు భారీ డిమాండ్
ప్రస్తుతం హైదరాబాద్‌లో 44 లక్షల నుంచి కోటిన్నర రేంజ్‌లో ఇళ్లకు భారీ డిమాండ్ ఉంటోంది. అందుకు అనుగుణంగానే బిల్డర్లు నివాస గృహాల నిర్మాణాలు చేపడుతున్నారు. రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులు పెరగడంతో నగర శివారు ప్రాంతాల్లో సైతం ఇళ్ల కొనుగోలుకు ఆసక్తిచూపుతున్నారు. క్రమంగా ఇంటి ధరల రేంజ్ పెరుగుతుండటంతో కొనుగోలు నిర్ణయం తీసుకున్నాక ఆలస్యం చేయకూడదని రియాల్టీ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఇండియన్ రియల్టీ రంగంలో హాట్‌‌స్పాట్‌‌గా హైదరాబాద్.. మంచి డిమాండ్ ఉన్న సిటీగా భాగ్యనగరం

హైదరాబాద్‌లో రియాల్టీ ప్రాజెక్టులు ఊపందుకున్నాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు, విల్లాల కొనుగోలుకు నగరవాసులు పోటీ పడుతున్నారు. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఖర్చు ఎక్కువైనా వెనకాడకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో కొనుగోలుదారుల డిమాండ్‌ను బట్టి ఆయా ప్రాంతాల్లోనూ ఇళ్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు, పెట్టుబడులు మరింత ప్లస్‌ అవుతాయనే నిపుణులు చెబుతున్నారు.

Also Read: గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీరు ఆదా.. ఎలాగంటే?

అనుకున్నదాని కంటే 2023లో ఇళ్ల కొనుగోళ్లు పెరిగాయి. హౌసింగ్‌ రిజిస్ట్రేషన్లు పెరగడం కూడా ఇళ్ల ధరలు పెరిగేందుకు కారణమైంది. భూముల ధరలకు అనుగుణంగా ఇళ్లధరలు భవిష్యత్తులో మరింత పెరగక తప్పదని రియాల్టీ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.