టాప్ 7 నగరాల్లో ఎప్పుడూ లేనంతగా హౌజ్‌ సేల్స్‌.. 31 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు

ఇండియన్ రియల్టీ రంగంలో హైదరాబాద్ హాట్‌‌స్పాట్‌‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల వాళ్లు, విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలకు హైదరాబాద్ ఫైనల్ డెస్టినేషన్ పాయింట్‌గా మారింది.

Housing sales up by 31 percent in 2023 in top 7 Indian cities and hyderabad stands at 4th

Housing sales: దేశంలో పల్లెల నుంచి పట్టణాలకు వలసలు భారీగా పెరుగుతున్నాయి. పల్లెలు పట్టణాలుగా మారుతుంటే, పట్టణాలు నగరాలుగా రూపంతరం చెందుతున్నాయి. దీంతో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సిటిజన్స్ అమితాసక్తి చూపుతున్నారు. సొంతింటి కల డిమాండ్‌తో సెకండ్‌ గ్రేడ్‌ టౌన్స్, మెట్రో సిటీల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇళ్ల కొనుగోళ్లలో గతేడాది టాప్ సెవెన్ నగరాల్లో 31 శాతం వృద్ధి నమోదైందంటే.. నగరాల్లో ఇళ్లకున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు.

దేశంలో పట్టణ జనాభా అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతుండడంతో నగరాలు విస్తరిస్తున్నాయి. అంతే కాకుండా మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులు, విద్యాసంస్థలు పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రోజురోజుకు పల్లెల నుంచి పట్టణాలకు వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అతివేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏడాది కాలంగా దేశంలోని టాప్ సెవెన్ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగాయి.

31 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు
గతంతో పోలిస్తే 2023లో దేశవ్యాప్తంగా 31 శాతం ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. పూణె, ముంబాయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీలో ఇళ్ల అమ్మకాలు భారీగా జరిగినట్లు సర్వేల్లో తేలింది. 2022లో 3 లక్షల 64 వేల 870 ఇళ్ల అమ్మకాలు జరగగా.. 2023లో 4 లక్షల 76 వేల 530కి అమ్మకాలు పెరిగాయి. ఇందులో అత్యధికంగా 52 శాతంతో పూణె నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. 40 శాతంతో రెండోస్థానంలో ముంబయి, 34 శాతంతో మూడోస్థానంలో చెన్నై, 30 శాతంతో నాలుగో స్థానంలో హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. తర్వాత వరుసగా బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ నగరాలున్నాయి.

హైదరాబాద్ హాట్‌‌స్పాట్‌‌
హైదరాబాద్‌లో 2022లో 47 వేల ఇళ్ల అమ్ముడు పోగా 2023లో 62వేల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఇలా మన గ్రేటర్ సిటీలోనే మొత్తంగా 30 శాతం ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. ఇందుకు కారణం ఇండియన్ రియల్టీ రంగంలో హైదరాబాద్ హాట్‌‌స్పాట్‌‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల వాళ్లు, విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలకు హైదరాబాద్ ఫైనల్ డెస్టినేషన్ పాయింట్‌గా మారింది. నగరానికి ఐటీ, ఐటీయేతర కంపెనీల పెట్టుబడులు రావడం, రవాణా సౌకర్యాలు పెరగడం, జాబ్, బిజినెస్ పేరిట ఏటా లక్షలాది మంది సిటీకి వస్తుండడంతో.. రియల్‌ఎస్టేట్‌ రంగం బూమ్‌‌లో ఉంది. హైదరాబాద్‌ సెంటర్ నుంచి ఎటుచూసినా… ఇళ్లు, అపార్ట్‌‌మెంట్లు, విల్లాలు, ఫాంహౌస్‌‌ల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.

Also Read: హైదరాబాద్ రియాలిటీకి బూస్ట్.. మినీ ఇండియాగా మారుతున్న భాగ్యనగరం

గతంలో ఔటర్ రింగ్‌రోడ్డుకు ఇరువైపులా సాగిన రియల్ ఎస్టేట్ బిజినెస్.. ఇప్పుడు రీజనల్ రింగురోడ్డు వైపుగా దూసుకెళ్తోంది. హైదరాబాద్ ఫ్యూచర్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది సిటీ చుట్టుపక్కల భూములు, స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఎప్పటికీ ఇళ్లకు మంచి డిమాండ్ ఉంటుందని, పెట్టుబడులకు ఢోకా ఉండదంటున్నారు రియాలిటీ రంగ నిపుణులు.

Also Read: హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్.. సిటీకి నాలుగు దిక్కుల ప్రత్యేక టౌన్‌షిప్స్‌

రోజురోజుకు గ్రేటర్ హైదరాబాద్ రియాలిటీకి మంచి డిమాండ్ ఉన్న సిటీగా నిలుస్తోంది. గతేడాది సిటీ చుట్టుపక్కల భారీగా రిజిస్ట్రేషన్లు జరగడమే కాకుండా ఇళ్ల అమ్మకాల్లోనూ దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. సొంతింటి కలను సాకారం చేసుకోవడమే కాకుండా ఇంటిపై పెడుతున్న పెట్టుబడి గ్రేటర్‌లో మంచి రిటర్న్స్‌ను ఇస్తోందంటున్నారు నిపుణులు.