ICICI Bank Credit Card
ICICI Credit Card : ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. మీ క్రెడిట్ కార్డును పోగొట్టుకున్నారా? మీ అకౌంటులో ఏవైనా అనుమానిత లావాదేవీలు జరిగినట్టు గమనించారా?
అయితే మీరు వెంటనే మీ క్రెడిట్ కార్డు బ్లాక్ చేయవచ్చు. దేశంలోని ఇతర బ్యాంకుల మాదిరిగానే ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టంట్ క్రెడిట్ కార్డ్ బ్లాకింగ్ కోసం అనేక ఆప్షన్లను అందిస్తుంది.
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. షాపింగ్ కోసం లేదా ఇతర అవసరాల కోసం క్రెడిట్ కార్డు వాడేస్తుంటారు. ఈ కార్డును మీ వద్ద చాలా సేఫ్‌గా ఉంచుకోవాలి.
మీ క్రెడిట్ కార్డ్ ఎక్కడైనా పోయినా లేదా మీ అకౌంటులో ఏదైనా అనాధికారిక లావాదేవీ జరిగినా మీరు వెంటనే మీ ఇంటి నుంచే బ్లాక్ చేయవచ్చు.
ఏదైనా మోసం లేదా అనధికార లావాదేవీలను నివారించేందుకు ఇతర బ్యాంకుల మాదిరిగానే, ICICI బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డును ఇన్‌స్టంట్ బ్లాక్ చేసేందుకు అనేక ఆప్షన్లను అందిస్తుంది. దీనికి iMobile Pay యాప్ కస్టమర్ కేర్ ఆప్షన్ రెండూ ఉన్నాయి. మీ సౌలభ్యం ప్రకారం ఈ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
iMobile Pay యాప్ ఉపయోగించి ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని బ్లాక్ చేయడం ఎలా? :
కస్టమర్ కేర్ ద్వారా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డును ఎలా బ్లాక్ చేయాలి? :
మీ బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచి 1800 1080 (టోల్ ఫ్రీ) లేదా +91 22 33667777కు కాల్ చేయండి. IVR ప్రాంప్ట్‌లతో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించి మీ క్రెడిట్ కార్డును బ్లాక్ రిక్వెస్ట్ ఎంటర్ చేసుకోండి.
రిక్వెస్ట్ డేటాను యాక్టివ్ ద్వారా మీ ఐడెంటిటీని వెరిఫై చేయండి. ఆ తర్వాత కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మీ కార్డును బ్లాక్ చేసి కన్ఫార్మ్ చేయొచ్చు.