Credit Score
Credit Score : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అదే పనిగా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారా? క్రెడిట్ కార్డు లిమిట్ దాటి మరి వాడేస్తున్నారా?
అయితే ఇది మీకోసమే.. మీ క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది జాగ్రత్త.. ఈ క్రెడిట్ స్కోరు సరిగా ఉంటేనే ఏదైనా బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి.
వెహికల్ లోన్లు, పర్సనల్ లోన్లు లేదా హోం లోన్లకు దరఖాస్తు చేస్తే ముందుగా చూసేది క్రెడిట్ స్కోరు మాత్రమే. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు ఎలాంటి లోన్లు రావు. ఒకవేళ వచ్చినా రిజక్ట్ అవుతాయి.
కొన్నిసార్లు అధిక వడ్డీ రేట్లతో లోన్లు తీసుకోవాల్సి వస్తుంది. అయితే, క్రెడిట్ స్కోర్ తగ్గిందని ఆందోళన అవసరం లేదు. క్రెడిట్ స్కోరు పెంచుకునేందుకు కొన్ని టిప్స్ పాటిస్తే సరి.. క్రమంగా మీ క్రెడిట్ స్కోరు పెరుగుతుంది. క్రెడిట్ స్కోరు స్పీడ్‌గా పెరగాలంటే ముందుగా ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..
గడువుకు ముందే పేమెంట్స్ చెల్లించండి :
పేమెంట్ ముందుగా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. క్రెడిట్ బిల్లులు, ఈఎంఐలను ఎప్పుడూ ఆలస్యం లేకుండా గడువు తేదీలోపు చెల్లించాలి.
ఒక పేమెంట్ మిస్ అయినా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఆటోడెబిట్ సెటప్ చేసుకోండి. రిమైండర్లతో పేమెంట్ల తేదీలను గుర్తుంచుకోవచ్చు. క్రెడ్ యాప్స్ వాడండి.
పరిమితికి మించి వాడకం :
క్రెడిట్ లిమిట్ మొత్తాన్ని వాడకూడదు. క్రెడిట్ లిమిట్ 30శాతం కన్నా తక్కువే వాడాలి. క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ. లక్ష ఉంటే.. రూ.30వేల కన్నా ఎక్కువ వాడొద్దు. అలా చేస్తే పెద్దగా ఖర్చు చేయరని కంపెనీలు భావిస్తాయి. అవసరానికి మించి ఖర్చు చేస్తే క్రెడిట్ స్కోరుపై ఎఫెక్ట్ పడవచ్చు.
పాత క్రెడిట్ కార్డు క్లోజింగ్ :
క్రెడిట్ హిస్టరీ అత్యంత ముఖ్యం. మీ పాత క్రెడిట్ కార్డులంటే జాగ్రత్త.. క్రెడిట్ స్కోర్ పెరగలన్నా తగ్గాలన్నా ఇవే ముఖ్యం. వాడటం లేదని పాత కార్డులను క్లోజ్ చేయొద్దు. ఇలా చేస్తే సగటు క్రెడిట్ హిస్టరీ తగ్గి స్కోర్ కూడా తగ్గిపోవచ్చు. ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నా కూడా మంచిది కాదు.
లోన్, క్రెడిట్ కార్డులు అతిగా తీసుకోవద్దు :
అవసరానికి మించి కొత్త క్రెడిట్ కార్డులు తీసుకోవద్దు. లోన్ కోసం అప్లయ్ చేస్తే.. క్రెడిట్ రిపోర్టు చెక్ చేస్తుంది. మీరు ఎక్కువగా అప్లయ్ చేసి ఉంటే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది.
క్రెడిట్ రిపోర్ట్ తరచూ చెక్ చేయాలి :
క్రెడిట్ బ్యూరో సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్ నుంచి క్రెడిట్ రిపోర్ట్ తప్పనిసరిగా చెక్ చేయాలి. ఏదైనా తేడాలు ఉంటే గమనించి ఆ తప్పులను సరిదిద్దాలి. లేదంటే స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. క్రెడిట్ బ్యూరోకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి.
తద్వారా క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు. లోన్ డిఫాల్ట్ అయితే బ్యాంకుతో సెటిల్మెంట్ చేసుకోవాలి. రీపేమెంట్ ప్లాన్ చేయాలి. కుదిరితే వన్ టైం సెటిల్మెంట్ చేయొచ్చు. అప్పు చెల్లించిన తర్వాత ‘లెటర్ ఆఫ్ క్లోజర్ ‘ తప్పక తీసుకోవాలి.