Upcoming Smartphones : ఖతర్నాక్ ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. వివో నుంచి వన్‌ప్లస్ వరకు రాబోయే ఫోన్లు ఇవే..!
Upcoming Smartphones : సరికొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? వివో నుంచి వన్‌ప్లస్ ఫోన్ వరకు రాబోతున్నాయి.. కొత్త ఫోన్ల లిస్ట్ ఇదిగో..

Upcoming Smartphones
Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ జూన్‌లో వన్‌ప్లస్ నుంచి వివో వరకు అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. మీరు కాంపాక్ట్ ఫోన్ కావాలంటే వన్‌ప్లస్ 13s బెస్ట్ ఆప్షన్.
Read Also : BSNL Plan : BSNL అదిరే ప్లాన్.. రోజుకు 3GB హైస్పీడ్ డేటా.. 90 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!
భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ NxtQuantum కూడా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ బ్రాండ్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. వివో T4 Ultra కూడా లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ల ప్రత్యేక ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.
వన్‌ప్లస్ 13s :
వన్‌ప్లస్ 13s కాంపాక్ట్ ఫోన్ జూన్ 5న లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.32-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. కీ ప్లస్ బటన్ కూడా ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
కంపెనీ ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 13T రీబ్రాండెడ్ వెర్షన్ అవుతుంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని మార్పులతో భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
వివో T4 అల్ట్రా :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ జూన్‌లో లాంచ్ కానుంది. వివో T4 అల్ట్రా ఫోన్ టెలిఫోటో కెమెరా లెన్స్‌తో వస్తుంది. 100X జూమ్ ఫీచర్ కలిగి ఉంటుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీపై కంపెనీ ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు. ఈ ఫోన్ 6.67-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమన్షిటీ 9300 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP IMX921 ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఈ వివో ఫోన్ 90W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
పోకో F7 :
పోకో F7 ఫోన్ జూన్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లీక్‌ల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 7,550mAh బ్యాటరీతో 90W ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 20MP సెల్ఫీ కెమెరా ఉంటాయి.
NxtQuantum ఏఐ+ ఫోన్ :
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి స్వదేశీ ఫోన్ కొత్త బ్రాండ్ ఫోన్ రాబోతుంది. (NxtQuantum) షిఫ్ట్ టెక్నాలజీతో ఏఐ ప్లస్ ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది.
Read Also : Motorola Edge 50 Ultra : భలే డిస్కౌంట్ భయ్యా.. ఈ మోటోరోలా అల్ట్రా 5G ఫోన్ అతి తక్కువ ధరకే..!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్లకు సంబంధించి ఎలాంటి వివరాలను బ్రాండ్ రివీల్ చేయలేదు. రాబోయే ఈ ఏఐ ప్లస్ ఫోన్ జూన్ చివరిలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.