Motorola Edge 50 Ultra : భలే డిస్కౌంట్ భయ్యా.. ఈ మోటోరోలా అల్ట్రా 5G ఫోన్ అతి తక్కువ ధరకే..!
Motorola Edge 50 Ultra : మోటోరోలా అల్ట్రా 5G ఫోన్ ఆఫర్ అదిరింది.. అమెజాన్‌లో ఈ మోటోరోలా ఫోన్ ఏకంగా రూ. 12,250కి తగ్గింది.

Motorola Edge 50 Ultra
Motorola Edge 50 Ultra : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ ధర భారీగా తగ్గింది. కెమెరా, పర్ఫార్మెన్స్, డిజైన్, డిస్‌ప్లే వంటి ఫీచర్లతో రూ. 50వేల లోపు బడ్జెట్ ధరలో కొనుగోలు చేయొచ్చు.
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్న వారికి ఇది బెస్ట్ డీల్. భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ రూ.59,999కి లాంచ్ అయింది.
స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్, పవర్‌ఫుల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G ధర :
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G ఫోన్ ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా రూ.48,999కు కొనుగోలు చేయొచ్చు. HDFC ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై కస్టమర్లు అదనంగా రూ.1,250 డిస్కౌంట్ పొందవచ్చు.
నెలకు రూ.2,376 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. మీ పాత ఫోన్ మోటో ఎడ్జ్ 50 అల్ట్రాతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
కొనుగోలుదారులు రూ. 46,500 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. వర్కింగ్ కండిషన్ మోడల్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. కస్టమర్‌లు అదనంగా ఎక్స్‌టెండెడ్ వారంటీ, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్‌లను పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ 6.7-అంగుళాల సూపర్ 1.5K pOLED ప్యానెల్ (1220p)తో 144Hz రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
HDR10+, DCI-P3 100 శాతం కలర్ గమట్, LTPS, DC డిమ్మింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. హుడ్ కింద, స్మార్ట్‌ఫోన్ 12GB LPDDR5X ర్యామ్ అదనపు 12GB ద్వారా 512GB స్టోరేజీ, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది.
ఈ మోటోరోలా ఫోన్ 40 గంటల వరకు స్టాండ్ బై టైమ్‌తో 4500mAh బ్యాటరీ కలిగి ఉంది. 125W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ పవర్ షేరింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
Read Also : PM KISAN : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడేది అప్పుడే.. మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలంటే?
కెమెరా విషయానికొస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ ప్లస్ లేజర్ ఆటోఫోకస్‌తో 64MP టెలిఫోటోతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ మోటోరోలా ఫోన్ 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.