HP Black Friday Deals : హెచ్‌పీ బ్లాక్ ఫ్రైడే డీల్స్.. భారత్‌లో ఈ ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్ అదిరే డిస్కౌంట్లు.. డోంట్ మిస్!
HP Black Friday Deals : నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు భారత మార్కెట్లోని వినియోగదారులకు బ్లాక్ ఫ్రైడే డీల్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.

HP Announces Black Friday Deals
HP Black Friday Deals : కొత్త ల్యాప్‌ట్యాప్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ హెచ్‌పీ బ్లాక్ ఫ్రైడే డీల్స్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల శ్రేణిపై ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లతో భారత మార్కెట్లో కస్టమర్‌లు సాధారణ మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరలకు ఎంపిక చేసిన మోడల్‌లను పొందవచ్చు.
ఈ ఆఫర్‌లు రూ. 79,999 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న పీసీలపై వర్తిస్తాయి. భారత్‌లో రాయితీ ఐటమ్‌లలో ఎంపిక చేసిన ఒమెన్, విక్టస్, స్పెక్టర్, పెవిలియన్, ఎన్వీ సిరీస్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు ఉన్నాయి. ముఖ్యంగా, ఆఫర్‌లు లిమిటెడ్ టైమ్ అందుబాటులో ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ యూజర్లకు అర్హులు.
హెచ్‌పీ బ్లాక్ ఫ్రైడే డీల్స్ :
నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు భారత మార్కెట్లోని వినియోగదారులకు బ్లాక్ ఫ్రైడే డీల్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. రూ. 79,999 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలపై కొనుగోలుదారులకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ రూ. 5వేలు పొందవచ్చు. అయితే రూ. 99,999 విలువైన లేదా అంతకంటే ఎక్కువ ప్రొడక్టు కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 8వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ముఖ్యంగా, ఈ ఆఫర్‌లు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌లలో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునే వారికి మాత్రమే వర్తిస్తాయి. ఆఫర్‌లు హెచ్‌పీ వరల్డ్ స్టోర్స్‌లో అన్ని హెచ్‌పీ అధీకృత ఆఫ్‌లైన్ విక్రేతల వద్ద అందుబాటులో ఉన్నాయని కంపెనీ పత్రికా ప్రకటనలో ధృవీకరించింది. భారత మార్కెట్లో ఆసక్తిగల కొనుగోలుదారులు ఒమెన్, విక్టస్, స్పెక్టర్, పెవిలియన్, ఎన్వీ సిరీస్ నుంచి అనేక ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఆప్షన్లపై రూ. 8వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
హెచ్‌పీ బ్లాక్ ఫ్రైడే డీల్స్ :
హెచ్‌పీ విక్టస్, హెచ్‌పీ ఒమెన్ 16, హెచ్‌పీ ఒమెన్ 17, హెచ్‌పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 అలాగే హెచ్‌పీ ఒమెన్ 35ఎల్ గేమింగ్ డెస్క్‌టాప్ వంటి గేమింగ్ మెషీన్‌లపై అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, దేశంలో హెచ్‌పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 షాడో బ్లాక్ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 1,74,999కు అందుబాటులో ఉంటుంది.
హెచ్‌పీ అందించే ఇతర పీసీ ఆఫర్‌లలో వినియోగదారులు హెచ్‌పీ ఒమినిబుక్ అల్ట్రా ఫ్లిప్, హెచ్‌పీ ఒమినిబుక్ ఎక్స్, హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14, హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360, హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360, హెచ్‌పీ ఎలైట్ బుక్ అల్ట్రా జీ1క్యూ వంటి డీల్స్ ఆస్వాదించవచ్చు. డ్రాగన్‌ఫ్లై జీ4, హెచ్‌పీ ఒమినిబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 అల్ట్రా 7 ప్రారంభ ధర రూ. 1,81,999, అయితే, హెచ్‌పీ ఒమినిబుక్ ఎక్స్ ప్రారంభ ధర రూ. 1,39,999కు పొందవచ్చు.