Hyderabad Development : ఎన్ఆర్ఐల చూపు.. హైదరాబాద్ వైపు.. దేశ విదేశాలను ఆకర్షిస్తున్న మహానగరం..!

హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల ప్రజలు భారీగా సెటిల్‌ అవుతోన్నారు. ఉద్యోగం, వ్యాపారం కోసం వచ్చి ఇక్కడే స్థిరపడుతోన్నారు. జీహెచ్‌ఎంసీ పరిసరాల్లో ప్రాపర్టీల కొనుగోలుపై ఎన్‌ఆర్‌ఐల మక్కువ చూపిస్తున్నారు. 

Hyderabad Realty Development

Hyderabad Development : అన్ని సంస్కృతుల మిశ్రమంగా ఉన్న హైదరాబాద్‌ నగరం మినీ ఇండియాగా కితాబునందుకుంటోంది. సౌత్‌ ఇండియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న నగరాల్లో హైదరాబాద్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డెవలప్‌ చేసిన మౌలిక సదుపాయాలతో పాటు… చక్కని వాతావరణంతో ప్రతి ఒక్కరి చూపు హైదరాబాద్‌పైనే ఉంది. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు.. హైదరాబాద్‌ పరిస్థితులు చూశాక… ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ఎన్‌ఆర్‌ఐలు కూడా చేరారు.

Read Also : Real Estate Investment: రియాల్టీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోన్న ప్రజలు

స్థిరాస్తుల కొనుగోలుపై ఆసక్తి :
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్న హైదరాబాద్‌ మహానగరంలో సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అవకాశం ఉన్న ఎంతో మంది ఆ దిశగా ప్రయత్నం చేసి సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. ఇక గత కొంత కాలం నుంచి విశ్వనగరంలో తెలుగువారే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా స్థిరాస్తుల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు.

ప్రాపర్టీల కొనుగోలుపై ఎన్‌ఆర్‌ఐల మక్కువ : 
ముఖ్యంగా హైదరాబాద్‌తో ఎక్కువ అనుబంధం ఉన్న ఎన్ఆర్‌ఐలు కూడా ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేస్తున్నారు. సౌత్ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉండటం విశ్వనగరానికి కలసివచ్చింది. విద్యా, ఉపాధితో పాటు ట్రాన్స్‌పోర్ట్‌, హాస్పిటాలిటీ తదితర రంగాల్లో మెరుగ్గా ఉండటంతో ఎన్‌ఆర్‌ఐల చూపు హైదరాబాద్‌పై పడింది.

ఇక హైదరాబాద్‌కు ఉన్న ప్లస్‌ పాయింట్‌ వాతావరణం. ఇక్కడి వాతావరణంతో అన్ని వయస్సుల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు రోడ్డు, రైల్‌ నెట్‌వర్క్‌తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం మంచి అస్సెట్‌గా చెప్పొచ్చు. దీంతో విదేశాల్లో సెటిల్‌ అయిన ఎన్‌ఆర్‌ఐలు ప్రస్తుతం హైదరాబాద్‌పై ఫోకస్‌ పెట్టారు. ఓపెన్‌ ప్లాట్స్‌, ఇండిపెండెంట్‌ ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్‌, ఆఫీస్‌ స్పేస్‌ కొనుగోలు చేస్తున్నారు.

తాము సంపాదిస్తున్న డబ్బును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్, ఫిక్స్ డిపాజిట్లు వంటి వాటిపై పెట్టకుండా భూమిపై పెట్టాలని చాలా మంది ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ప్రాపర్టీ కొనుగోలు సేఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు, హై రిటర్న్స్‌కు చక్కని ఆప్షన్‌ అని ఎన్‌ఆర్‌ఐలు భావిస్తున్నారు. అందువల్లే ఎన్‌ఆర్‌ఐలు హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయపడుతున్నారు.

Read Also : Real Estate East Hyderabad : మహానగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్టీ రంగం.. ఇన్వెస్ట్‌మెంట్‌కు బెస్ట్‌ చాయిస్‌గా ఈస్ట్‌ హైదరాబాద్‌!