Hyderabad Realty: వృద్ధి బాటలో హైదరాబాద్ రియాల్టీ మార్కెట్.. ఐదు రెట్లు పెరిగిన సేల్స్‌

హైదరాబాద్ నిర్మాణ మార్కెట్ క్రమంగా పుంజుకుంది. గతంలో సంవత్సరానికి 10వేల ఇళ్ల అమ్మకాలు జరిపే నగరంలో ఇప్పుడు స్తిరమైన అభివృద్ది కనిపిస్తోంది. పెరుగుతున్న నిర్మాణాలకు అనుగుణంగా అమ్మకాల్లోను రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్.

Hyderabad Real Estate Market Growth

Hyderabad Real Estate Market: దేశమంతా ఒక లెక్క.. హైదరాబాద్‌ది మరో లెక్క. కరోనా (Carona) వంటి విపత్కర సమయంలో భాగ్యనగర నిర్మాణరంగ సత్తా ఏంటో ప్రపంచమంతా తెలిసింది. విపత్కర సమయంలో కూడా దేశంలోని మిగతా నగరాల్లో నిర్మాణ రంగం పూర్తిగా నీరుగారిపోతే హైదరాబాద్‌లో మాత్రం తగ్గేదేలే అంటూ మరింత స్పీడ్ అందుకుంది. కేవలం నివాస, వాణిజ్య ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకోవడమే కాకుండా అమ్మకాల్లోనూ తన మార్క్‌ను చూపించింది. దీంతో హైదరాబాద్ నిర్మాణ మార్కెట్ క్రమంగా పుంజుకుంది. గతంలో సంవత్సరానికి 10వేల ఇళ్ల అమ్మకాలు జరిపే నగరంలో ఇప్పుడు స్తిరమైన అభివృద్ది కనిపిస్తోంది. పెరుగుతున్న నిర్మాణాలకు అనుగుణంగా అమ్మకాల్లోను రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్.

సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం 2015లో హైదరాబాద్‌లో సంవత్సరానికి 10 వేల ఇళ్ల అమ్మకాలు జరిగేవి. అటు నుంచి క్రమంగా గృహ అమ్మకాల్లో స్పీడ్ పెరుగుతూ వస్తోంది. 2020లో 22 వేల ఇళ్ల అమ్మకాలతో భాగ్యనగరం దేశంలోని మిగతా నగరాల చూపును తనవైపు తిప్పుకుంది. ఆ తరువాత గత యేడాది 2022లో ఏకంగా 42 వేల గృహ అమ్మకాలతో రికార్డు సృష్టించింది. హైదరాబాద్ నిర్మాణరంగంలో ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే వచ్చే ఐదేళ్లలో అంటే 2028 నాటికి ఇళ్ల మార్కెట్ పరిణామం ఏకంగా లక్ష గృహాలకు చేరుతుందని రియల్ ఎస్టేట్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. నగరంలో పెరుగుతున్న జనాభా, విద్యా, ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు, మౌళిక వసతుల అభివృద్ది, రియల్ రంగంలో ఎన్ఆర్ఐల పెట్టుబడులు వంటి సానుకూల అంశాలతో హైదరాబాద్ గృహ మార్కెట్ శరవేగంగా దూసుకెళ్తోందని అభిప్రాయపడుతున్నారు.

Also Read: కోటి రూపాయలకు మించి ధర ఉన్న ఇళ్లకు భారీ డిమాండ్.. హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..

ఢిల్లీ, ముంబై, బెంగళూరులాంటి నగరాలతో పోలిస్తే ఇప్పటికీ హైదరాబాద్ గృహ మార్కెట్ తక్కువే అయినా ఆయా నగరాలు జనాభాతో పోలిస్తే హైదరాబాద్ జనాభా తక్కువ. కాబట్టి గ్రేటర్ సిటీలోని జనాభా ప్రాతిపతికన వచ్చే ఐదేళ్లలో యేడాదికి లక్ష ఇళ్లకు రియాల్టీ మార్కెట్ చేరనుండటం మంచి పరిణామమని రియాల్టీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ, ప్రీమియం రేంజ్ ఇళ్లతో పాటు అందుబాటు ధరల్లో నిర్మాణం పెరిగితే ఢిల్లీ, ముంబై నగరాలతో సమానంగా మన గృహ మార్కెట్ పెరుగుతుందని రియాల్టీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: మెట్రో నగరాల్లో క్రమంగా పెరుగుతోన్న ఇళ్ల ధరలు.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

ట్రెండింగ్ వార్తలు