Hyundai Creta Electric : రూ.18 లక్షల హ్యుందాయ్ క్రెటా EV ఇప్పుడు జస్ట్ రూ.10.99 లక్షలకే.. నెలకు EMI ఎంతంటే?
Hyundai Creta Electric : హ్యుందాయ్ మోటార్ ఇండియా హ్యుందాయ్ క్రెటా ఈవీలో కొత్త బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త BaaS మోడల్‌తో క్రెటా ఈవీని తక్కువ ధరకు కొనేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Hyundai Creta Electric
- కొత్త బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్
- ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షలు
- BaaS మోడల్‌తో క్రెటా ఈవీ తక్కువ ధరకే
Hyundai Creta Electric : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనేవారికి గుడ్ న్యూస్.. మీరు హ్యుందాయ్ అభిమానులు అయితే ఇదే అద్భుతమైన అవకాశం.. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ పెరుగుతోంది.
పెట్రోల్, డీజిల్ కార్ల కన్నా ఈవీ కార్లను కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్ డిమాండ్ (Hyundai Creta Electric) తగినట్టుగా ఆటోమొబైల్ కంపెనీలు కూడా అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త ఈవీ కార్లను దించుతున్నాయి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా హ్యుందాయ్ క్రెటా ఈవీ కోసం కొత్త బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ కింద వినియోగదారులు ఇకపై కారు పూర్తి ధరను ఒకేసారి చెల్లించాల్సి అవసరం లేదు. ఈ కొత్త BaaS మోడల్‌తో ఇప్పుడు క్రెటా ఈవీని తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
హ్యుందాయ్ క్రెటా ఈవీ BaaS మోడల్ :
హ్యుందాయ్ క్రెటా ఈవీ బాస్ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షలకు లభిస్తుంది. ఈ బాస్ ఫీచర్ లేని హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రారంభ ధర రూ. 18.03 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు లభిస్తుంది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్ కారును కొనుగోలు చేసేవారు బ్యాటరీ కోసం నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా పూర్తి ధరను ముందుగానే పే చేయాల్సిన పని ఉండదు.
హ్యుందాయ్ ప్రకారం.. ప్రారంభ బ్యాటరీ ఈఎంఐ ఖర్చు కిలోమీటరుకు సుమారుగా రూ. 3.9 ఉంటుంది. 42kWh బ్యాటరీ ప్యాక్ ఆధారంగా అంచనా. బ్యాటరీ ఖర్చులో 90 శాతం, 8.75 శాతం వడ్డీ రేటుతో 8 ఏళ్లకు లోన్ తీసుకోవచ్చు. సుమారుగా నెలకు సగటున 2,330 కిలోమీటర్ల డ్రైవింగ్ ఆధారంగా కంపెనీ అంచనా వేసింది. అంటే.. నెలకు సుమారు రూ. 9,100 (సుమారు రూ. 9,087) బ్యాటరీ కోసం ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
హ్యుందాయ్ క్రెటా ఈవీ బ్యాటరీ, రేంజ్ :
హ్యుందాయ్ క్రెటా ఈవీ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. అందులో 42 kWh బ్యాటరీ, 51.4 kWh బ్యాటరీ
42 kWh బ్యాటరీ : సింగిల్ ఫుల్ ఛార్జ్‌పై సుమారు 420 కి.మీ ట్రావెల్ రేంజ్
51.4 kWh బ్యాటరీ : సింగిల్ ఛార్జ్‌పై సుమారు 510 కి.మీ ట్రావెల్ రేంజ్
కొత్త BaaS ప్లాన్‌తో హ్యుందాయ్ క్రెటా ఈవీకి సంబంధించి కొన్ని కొత్త అప్డేట్లను ప్రవేశపెట్టింది. అన్ని వేరియంట్లలో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సైడ్ ఫుట్‌స్టెప్స్ ఉన్నాయి. ఈజీగా కారు ఎక్కొచ్చు అలాగే దిగొచ్చు కూడా. అంతేకాదు.. హోమ్ ఛార్జర్ (HC) వేరియంట్లలో ఇప్పుడు 7.4 kW వాల్-బాక్స్ ఛార్జర్ చేర్చింది. తద్వారా మీ ఇంట్లోనే ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
