Hyundai Car Discounts
Hyundai Car Discounts : మీరు కొత్త హ్యుందాయ్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే బెస్ట్ టైమ్.. ఎందుకంటే.. హ్యుందాయ్ నవంబర్ 2025కి ఇయర్ ఎండ్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులకు మోడల్‌ను బట్టి రూ. 7 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం. ఈ ఆఫర్లు హ్యుందాయ్ వార్షిక క్లియరింగ్ వ్యూహంలో భాగంగా అందిస్తోంది.
ఈ డిస్కౌంట్ స్కీమ్ చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల (Hyundai Car Discounts) నుంచి ప్రీమియం SUV కార్ల వరకు వైడ్ రేంజ్ హ్యుందాయ్ కార్లను కవర్ చేస్తుంది. వివిధ రకాల కొనుగోలుదారులకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, కొత్తగా అప్‌డేట్ చేసిన హ్యుందాయ్ వెన్యూ ఇటీవల లాంచ్ కాగా, ప్రస్తుతానికి ఈ ఆఫర్‌లో అందుబాటులో లేదని గమనించాలి.
గ్రాండ్ i10 నియోస్ :
ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ వేరియంట్‌లపై మొత్తం రూ. 25వేల వరకు, CNG వెర్షన్‌లపై రూ. 30వేల వరకు తగ్గింపును పొందింది. దీని పైన, కొనుగోలుదారులు రూ. 20వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5వేల కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లు బేస్ మోడల్ మినహా అన్ని వేరియంట్‌లకు వర్తిస్తాయి.
హ్యుందాయ్ ఆరా :
కాంపాక్ట్ సెడాన్ ఆరా పెట్రోల్ వెర్షన్లపై రూ. 15వేలు తగ్గింపు, CNG వేరియంట్లపై రూ. 25వేలు తగ్గింపుతో వస్తుంది. పెట్రోల్ కొనుగోలుదారులకు అదనంగా రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ కారుకు బేస్ వేరియంట్‌ను కూడా మినహాయించారు.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ :
హ్యుందాయ్ మైక్రో-SUV ఎక్స్‌టర్ త్వరగా పాపులర్ పొందింది. పెట్రోల్ వేరియంట్‌లపై రూ.20వేల ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్‌తో పాటు నాన్-ప్రో ప్యాక్‌లో రూ.25వేల వరకు, ప్రో ప్యాక్‌లో రూ.20వేల వరకు తగ్గింపును పొందుతుంది.
హ్యుందాయ్ i20 :
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ i20 కూడా ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. ఎందుకంటే.. మాన్యువల్ వేరియంట్‌లపై రూ. 25వేల తగ్గింపు, iVT వేరియంట్లపై రూ. 20వేల వరకు తగ్గింపు లభిస్తోంది. అదనంగా, హ్యుందాయ్ మాన్యువల్ (MT) కోసం రూ. 25వేలు, iVT కోసం రూ. 15వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తోంది.
హ్యుందాయ్ యాక్సెంట్ :
మిడ్-సైజ్ సెడాన్ వెర్నాపై రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 20వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10వేల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. సెడాన్ ప్రియులకు అద్భుతమైన వాల్యూ అందించే ఆప్షన్‌గా నిలిచింది.
హ్యుందాయ్ క్రెటా :
హ్యుందాయ్ బెస్ట్ సెల్లింగ్ క్రెటాపై పెద్దగా డిస్కౌంట్లను అందించడం లేదు. అయినప్పటికీ, కొనుగోలుదారులు ఇప్పటికీ రూ. 5వేల వరకు చిన్న స్క్రాపేజ్ బెనిఫిట్స్ పొందవచ్చు.
హ్యుందాయ్ అల్కజార్ :
మూడు వరుస సీట్ల అల్కాజార్ SUVపై రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 25వేల ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి. ఫ్యామిలీలకు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా అందిస్తుంది.
హ్యుందాయ్ టక్సన్, అయోనిక్ 5 :
టక్సన్ రూ. 20వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది. అయితే, ప్రీమియం ఎలక్ట్రిక్ SUV లోనిక్ 5 మొత్తం మీద అత్యధికంగా రూ. 7 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది. కానీ, 2024 స్టాక్‌పై మాత్రమే. ఈ ఆఫర్లు నవంబర్ నెలలో కార్ల కొనుగోలుదారులకు ముఖ్యంగా వివిధ సెగ్మెంట్లలో విలువైన డీల్స్ కోసం చూస్తున్న వారికి అద్భుతమైన నెలగా చెప్పొచ్చు.