Hyundai Electric Car
Hyundai Electric Car : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ నుంచి సరికొత్త హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. దక్షిణ కొరియాలో సియోల్ మొబిలిటీ షో 2025లో హ్యుందాయ్ సెకండ్ జనరేషన్ నెక్సోను ఆవిష్కరించింది.
కంపెనీ ఫ్యూయిల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలలో (FCEV) కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ సెకండ్ జనరేషన్ నెక్సో కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు, అడ్వాన్స్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. కొత్త నెక్సో కారు అక్టోబర్ 2024లో LA ఆటో షోలో ఆవిష్కరించిన హ్యుందాయ్ ఇనిటియం కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించింది.
ఈ మిడ్-సైజ్ SUV బ్రాండ్ కొత్త ‘ఆర్ట్ ఆఫ్ స్టీల్’ డిజైన్ లాంగ్వేజ్‌తో బోల్డ్ లైన్లు కలిగి ఉంది. ఈ కారు ఫుల్ ప్రొఫైల్ బాక్సీగా ఉంటుంది. కర్వడ్ షేపుడ్ క్రాస్ సెక్షన్‌తో స్పెషల్ డిజైన్ ఆకర్షణగా ఉంది. ఈ హైడ్రోజన్ కారు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.
కారులో అడ్వాన్స్‌డ్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ కారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. కారులో అనేక టెక్నికల్ ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ చాలా భిన్నంగా ఉంటుంది. అనేక సేఫ్టీ ఫీచర్లు కూడా కారులో ఉన్నాయి.
5 నిమిషాల ఛార్జింగ్‌తో 700 కి.మీ దూరం :
ఈ కారు 5 నిమిషాల ఛార్జింగ్‌తో 700 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. కంపెనీ సెకండ్ జనరేషన్ హ్యుందాయ్ నెక్సోను ప్రవేశపెట్టింది. హైడ్రోజన్ మొబిలిటీలో దూసుకుపోతోంది. ఇప్పుడు కంపెనీ పోర్ట్‌ఫోలియోలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్‌లు మాత్రమే కాకుండా FCEV కేటగిరీ కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ నెక్సో డిజైన్ :
ఈ కారు (INITIUM) కాన్సెప్ట్‌పై తయారైంది. అక్టోబర్ 2024లో ఈ కాన్సెప్ట్ ఆవిష్కరించారు. ఈ కారులో స్టీల్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ కారుకు ఆఫ్-రోడ్ టైప్ డిజైన్ కూడా ఉంది. నెక్సో కారులో 4 డాట్ లాంప్‌లు ఉన్నాయి. తద్వారా రాత్రిపూట కూడా కారు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారులో 993 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
అలాగే, కారు లోపలి భాగం విశాలంగా ఉంటుంది. కర్వడ్ డ్రైవర్ సెంట్రిక్ డిస్‌ప్లే అందిస్తోంది. ఇది కాకుండా, ఐలాండ్ టైప్ సెంటర్ కన్సోల్ అందిస్తోంది. డిజిటల్ సైడ్ మిర్రర్లు అమర్చారు. కారులో చాలా స్పేస్ ఉంటుంది. లోపలి భాగంలో మొదటి వరుసలో ప్రీమియం రిలాక్స్ సీట్లు ఉన్నాయి. రెండవ వరుసకు లెగ్ రెస్ట్, లెగ్‌రూమ్ అందుబాటులో ఉన్నాయి. రెండవ వరుస ప్రయాణీకులకు హెడ్‌రూమ్, షోల్డర్ రూమ్ కలిగి ఉన్నాయి.
6 కలర్ ఆప్షన్లలో హ్యుందాయ్ :
ఈ హ్యుందాయ్ హైడ్రోజన్ కారు మొత్తం 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో క్రీమీ వైట్ పెర్ల్, ఫాంటమ్ బ్లాక్ పెర్ల్, అమెజాన్ గ్రే మెటాలిక్, ఓషన్ ఇండిగో మాట్టే, ఎకోట్రానిక్ గ్రే పెర్ల్, గోయో కాపర్ పెర్ల్ ఉన్నాయి.
హ్యుందాయ్ నెక్సో స్పెసిఫికేషన్లు :
ఈ హైడ్రోజన్ కారులో 2.64kwh బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. కేవలం 7.8 సెకన్లలో 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బ్యాటరీ ప్యాక్ 201Bhp పవర్ వేగంగా ఉత్పత్తి చేస్తుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ స్టాక్ 147bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది.
ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే.. ఈ హైడ్రోజన్ కారు ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు 5 నిమిషాలు పడుతుంది. ఈ హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారు 6.69 కిలోల హైడ్రోజన్ ట్యాంక్‌ను కలిగి ఉంది. కేవలం 5 నిమిషాల్లో బ్యాటరీ ఫిల్ అయ్యాక 700 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
హ్యుందాయ్ నెక్సో ఫీచర్లు :
సెక్యూరిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కారులో 9 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ఈ ఎయిర్‌బ్యాగ్‌లు ప్రయాణీకులను రక్షించడంతో పాటు హైడ్రోజన్ ట్యాంక్‌ను కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. లేటెస్ట్ ADAS సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది.