ITR: తుది గడువు.. చివరిరోజు ఎన్ని లక్షల మంది ఐటీఆర్ దాఖలు చేశారో తెలుసా?

మొత్తం 6.50 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని పేర్కొంది. జులై 31తో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగుస్తుండడంతో..

ITR

ITR – Income Tax Department: ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ (Income-tax Returns)ను సోమవారం సాయంత్రం 6 గంటలలోపు ఎంతమంది దాఖలు చేశారన్న విషయంపై ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది.

మొత్తం 6.50 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని పేర్కొంది. జులై 31తో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగుస్తుండడంతో సోమవారం చాలామంది వాటిని దాఖలు చేసేందుకు లాగిన్ అయ్యారు. సోమవారం ఒక్కరోజే 36.91 లక్షల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ఇక ఆదివారం 26.76 లక్షల ఐటీఆర్లు దాఖలైన విషయం తెలిసిందే.

ఈ-ఫైలింగ్ పోర్టల్ లో ఆదివారం 1.30 కోట్ల మంది లాగిన్ అయితే, సోమవారం 1.78 కోట్ల మంది లాగిన్ అయ్యారని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఐటీఆర్ విషయంలో సాయం కావాలంటే తమ పోర్టల్ ద్వారా ఏ సమయంలోనైనా చాట్ చేయొచ్చని.. లేదా తమకు కాల్స్ చేయవచ్చని పేర్కొంది. ఆగస్టు నుంచి పెనాల్టీతో ఉద్యోగస్థులు ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు. పెనాల్టీ తప్పాలంటే సోమవారంలోపే ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

COVID-19: దేశంలో ప్రస్తుతం ఎన్ని కరోనా కేసులు ఉన్నాయో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు