COVID-19: దేశంలో ప్రస్తుతం ఎన్ని కరోనా కేసులు ఉన్నాయో తెలుసా?

దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల మొత్తం 4.49 కోట్ల (4,49,95,629)కు చేరిందని వివరించింది.

COVID-19: దేశంలో ప్రస్తుతం ఎన్ని కరోనా కేసులు ఉన్నాయో తెలుసా?

Corona Cases

COVID-19 India: దేశాన్ని కుదిపేసిన కరోనా (Corona) గురించి ప్రస్తుతం చాలా మందిలో భయం పోయింది. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని మర్చిపోయారు. ఇప్పటికీ దేశంలో పలు ప్రాంతాల్లో స్వల్ప సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కొత్తగా 41 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల మొత్తం 4.49 కోట్ల (4,49,95,629)కు చేరిందని వివరించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 1,467 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.

ఇవాళ ఉదయం 8 గంటల నాటికి.. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మొత్తం కలిపి 5,31,917గాఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,44,62,245గా ఉందని వివరించింది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను వినియోగించినట్లు చెప్పింది.

Palghar Railway Station: ఇండియాలో ఉండాలంటే మోదీ, యోగీలకు ఓటేయాలి.. ఒక సబ్‭ఇన్స్‭క్టర్, ముగ్గురు ముస్లింల‭ను కాల్చి చంపిన అనంతరం కానిస్టేబుల్ లెక్చర్లు