×
Ad

Income Tax Refund : మీ ITR రీఫండ్ రాలేదా? ఆన్‌లైన్‌లో టాక్స్ పేయర్లు చేసే తప్పులివే.. రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్!

Income Tax Refund : ఐటీఆర్ దాఖలు చేశాక రీఫండ్‌ల కోసం ఎదురుచూసే లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు బిగ్ షాకింగ్ న్యస్.. ప్రస్తుతం 5 మిలియన్లకు పైగా రీఫండ్‌లు ఇంకా ప్రాసెస్‌లో ఉన్నాయి. మీ ఫిర్యాదును ఇలా ఫైల్ చేయండి.

Income Tax Refund (Image Credit To Original Source)

  • 2025-26 AYలో 8 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు
  • 50 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు నో రిటర్న్స్
  • ఫిబ్రవరి 1నే బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్న కేంద్రం
  • రీపేమెంట్ ఆలస్యమైతే ఏం చేయాలి? స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

Income Tax Refund : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్లో ఆదాయపన్ను శాఖకు సంబంధించి అనేక కీలక ప్రకటనలు రాబోతున్నాయి. అందరూ రాబోయే బడ్జెట్‌లో ఏయే మినహాయింపులు ఉంటాయి? ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలామంది పన్నుచెల్లింపుదారులకు ఇప్పటికీ ఐటీఆర్ దాఖలు విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం రోజుల్లో ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేశాక రీఫండ్ పొందడం పన్నుచెల్లింపుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఐటీఆర్ దాఖలు చేసినా కూడా వారికి రీఫండ్ అందడం లేదు. లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఒకప్పుడు వారాలలోపు వచ్చే ఆదాయపు పన్ను రీఫండ్ డబ్బులు ఇప్పుడు నెలలు పడుతున్నాయి.

రీఫండ్ రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ ఏడాది 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి 5 మిలియన్లకు (50 లక్షలు) పైగా పన్నుచెల్లింపుదారులకు రీఫండ్ ఇప్పటికీ ప్రాసెస్‌లోనే ఉంది.

కొన్ని సందర్భాల్లో రీఫండ్ తిరిగిచ్చినా తప్పు బ్యాంక్ వివరాల కారణంగా డబ్బు బ్రాంచ్ బ్యాంకుకు తిరిగి వస్తుంది. మీరు ప్రతిరోజూ మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను చెక్ చేస్తుండాలి. అప్పటికీ మీకు రీఫండ్ రాకపోతే ఆలస్యానికి అసలు కారణం ఏంటి? ఎలా ఫిర్యాదులు చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రీపేమెంట్ ఆలస్యం అయ్యే ప్రధాన కారణాలివే :

  • మీ రిజిస్టర్ డేటాను ఆదాయపు పన్ను శాఖ పూర్తిగా ధృవీకరించాకే రీఫండ్ జారీ అవుతుంది.
  • రీఫండ్ ఆలస్యం ఈ కింది కారణాల వల్ల ఎక్కువగా ఉంటుంది.
  • ఐటీఆర్‌లో ప్రకటించిన ఆదాయం, ఫారమ్ 26AS,AISలో దాఖలు చేసిన సమాచారం మ్యాచ్ కాకపోవడం
  • బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ పూర్తి కాకపోవడం
  • ఐటీఆర్ ఇ-వెరిఫికేషన్ 30 రోజుల్లోపు పూర్తి కాకపోవడం
  • డిడెక్షన్ AOకి అనేక అనుమానాలు ఉన్నాయి. వివరణ అడుగుతూ నోటీసు జారీ
  • మీరు నోటీసుకు స్పందించకపోతే పన్ను వాపసు రాదు..

మీ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
మీ రీఫండ్ కచ్చితమైన స్టేటస్ చెక్ చేయడానికి ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్ (incometax.gov.in)కు లాగిన్ అవ్వండి. ఆ తర్వాత e-File → Income Tax Returns → ‘View Filed Returns’కు వెళ్లండి. మీరు ‘Refund Issued’ లేదా ‘Under Processing’ వంటి స్టేటస్‌లను చూస్తారు.

మీ పాన్ అసెస్‌మెంట్ ఇయర్‌ను ఎంటర్ చేయడం ద్వారా NSD (TIN-NSD) పోర్టల్‌లో రీఫండ్ స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు. స్టేటస్ ‘Refund Returned’ అంటే డిపార్ట్‌మెంట్ డబ్బు పంపింది. కానీ, మీ తప్పు బ్యాంక్ వివరాల కారణంగా పంపిన డబ్బు తిరిగి డిపార్ట్‌మెంట్‌కు వచ్చిందని అర్ధం చేసుకోవాలి.

Read Also :  Union Budget 2026 : టాక్స్ పేయర్లకు అలర్ట్.. పన్ను విధానం, HRA నుంచి 80C వరకు.. 2025 కొత్త ఆదాయపు పన్ను చట్టంలో రాబోయే ప్రధాన మార్పులివే..!

ఫిర్యాదు ఎలా దాఖలు చేయాలి? :
ఆన్‌లైన్ పోర్టల్‌లో స్టేటస్ ‘ప్రాసెసింగ్‌’ అని ఉండి, ఎక్కువ రోజులైతే మీరు బెంగళూరులోని CPC (సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్)ని సంప్రదించాలి. అలాగే, కాల్ చేసేటప్పుడు మీ పాన్ అసెస్‌మెంట్ ఇయర్‌ను రెడీగా ఉంచుకోండి. తద్వారా అధికారి మీకు సరైన సమాచారాన్ని అందించగలరు.

Income Tax Refund (Image Credit To Original Source)

మీరు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో (Grievances, Submit Grievance)కి సెక్షన్ కు వెళ్లండి. ‘CPC-ITR’అనే సెక్షన్ ఎంచుకుని (Refund related) కేటగిరీలో మీ ఫిర్యాదును సమర్పించండి. ఫిర్యాదులపై ఇంటిగ్రేటెడ్ ఫిర్యాదు వ్యవస్థ ఇ-నివారన్ సిస్టమ్ ద్వారా కూడా ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. అందుకే మీ ఫిర్యాదులో గత ఇమెయిల్ లేదా నోటీసుకు సంబంధించి వివరాలను కూడా అందించాలి.

బ్యాంక్ అకౌంట్ లేదా పాన్-ఆధార్ సమస్యలు :
బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పుగా ఉండటం లేదా పాన్-ఆధార్ లింకింగ్ సమస్యల కారణంగా కూడా రీఫండ్ ఆలస్యం కావచ్చు. రిటర్న్ ప్రాసెస్ అయినా ఆదాయపు పన్ను పోర్టల్‌లో బ్యాంక్ అకౌంట్ ముందస్తుగా వెరిఫై చేయకపోతే రీఫండ్ క్రెడిట్ కాదు.

మీ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :

  • ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీరు స్టేటస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
  • ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను విజిట్ చేసి మీ పాన్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  • ఈ-ఫైల్ సెక్షన్‌కు వెళ్లి ఆదాయపు పన్ను రిటర్న్‌ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఆపై వ్యూ ఫైల్డ్ రిటర్న్‌లపై క్లిక్ చేయండి.
  • మీ రీఫండ్ స్టేటస్ చెక్ చేసి సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోవాలి.
  • అనంతరం మీ పూర్తి వివరాలను View అనే ఆప్షన్ క్లిక్ చేయండి.

NSDL పోర్టల్‌లో స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే? :

  • NSDL రీఫండ్ స్టేటస్ పేజీని విజిట్ చేయండి.
  • మీ పాన్ నంబర్‌ ఎంటర్ చేసి అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోండి.
  • ప్రస్తుత రీఫండ్ స్టేటస్ వ్యూ కోసం పూర్తి వివరాలను సమర్పించండి.