ITR Filing : టాక్స్ పేయర్లకు అలర్ట్.. ఈ యాప్స్, వెబ్‌సైట్లలో ఫ్రీగా ITR ఫైల్ చేయొచ్చు తెలుసా? ఈజీ ప్రాసెస్ ఇదిగో..!

ITR Filing : ఆదాయపు పన్ను రిటర్న్స్ ఇ-ఫైలింగ్ కోసం ఇండిపెండెంట్ పోర్టల్‌ కూడా ఉంది. ఇది పూర్తిగా ఉచితం. ఛార్జీలు లేకుండా ఇ-ఫైలింగ్‌ను అనుమతించే ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Income Tax Return

Income Tax Return : టాక్స్ పేయర్లకు అలర్ట్.. ఆదాయ పన్ను చెల్లింపు గడువు తేదీ దగ్గర పడుతోంది. మార్చి 31లోగా పన్నుచెల్లింపుదారులు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. లేదంటే భారీ జరిమానాలు, పెనాల్టీలను చెల్లించాల్సి వస్తుంది.

పన్ను చెల్లింపుదారులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఇ-ఫైలింగ్ కోసం ఆదాయపు పన్ను శాఖ స్వతంత్ర పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా ఉచితం. అయితే, ఎలాంటి రుసుములు లేదా ఛార్జీలు లేకుండా ఇ-ఫైలింగ్‌ చేసేందుకు ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Read Also : Income Tax Deadline : ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో ITR ఫైలింగ్ ఎలా చేయాలి? ఏయే డాక్యుమెంట్స్ కావాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

ఆన్‌లైన్‌లో IT రిటర్న్ దాఖలు చేసే ప్రక్రియను ఇ-ఫైలింగ్ అంటారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ సంవత్సరం 2025-2026) ITR దాఖలు చేసేందుకు చివరి రోజు జూలై 31, 2025. ఆదాయపు పన్ను శాఖ ద్వారా రిజిస్టర్ చేసిన కొన్ని ప్రైవేట్ సంస్థలు తమ వెబ్‌సైట్‌ల ద్వారా ఇ-ఫైలింగ్ చేసుకునేందుకు అవకాశం అందిస్తున్నాయి.

ఈ ప్రైవేట్ వెబ్‌సైట్‌లలో కొన్నింటికి మాత్రం ఛార్జ్ చేయవచ్చు. కానీ, ఉచితంగా సర్వీసు అందించే వెబ్‌సైట్‌లు చాలా తక్కువగానే ఉన్నాయి. ఉచితంగా ITR దాఖలు చేసేందుకు అనుమతించే కొన్ని ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

ClearTax :
క్లియర్‌టాక్స్ (ClearTax) పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వకుండానే నేరుగా ITR దాఖలు చేయొచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ఆదాయం ఆధారంగా దాఖలు చేయాల్సిన ITRను ఆటోమాటిక్‌గా గుర్తిస్తుంది. ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా క్లియర్ టాక్సులో ITRను ఈ కిందివిధంగా దాఖలు చేయొచ్చు.

  • ఫారమ్ 16ని అప్‌లోడ్ చేయండి.
  • ClearTax ఆటోమాటిక్‌గా ITR రెడీ చేస్తుంది.
  • టాక్స్ సమ్మరీ వెరిఫై చేసుకోండి.
  • ఎక్‌నాల్డెజ్ నెంబర్ పొందడానికి మీ టాక్స్ రిటర్న్‌ను ఇ-ఫైల్ చేయండి.
  • నెట్ బ్యాంకింగ్ ద్వారా పన్ను రిటర్న్‌ను ఇ-వెరిఫై చేయండి.

MyITreturn :
మైఐటీరిటర్న్ (MyITreturn) అనేది ఆదాయపు పన్ను శాఖలో రిజిస్టర్ అయిన మరో అధికారిక ఇ-రిటర్న్ పోర్టల్. ఇది పూర్తిగా ఉచితం. మైఐటీరిటర్న్ వెబ్‌సైట్‌లో ITR దాఖలు చేసేందుకు వెబ్‌సైట్‌లోని ప్రాథమిక ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. ఈ ప్రశ్నలలో మీ జీతం, ఇల్లు, పెట్టుబడులు, మరిన్నింటికి సంబంధించినవి ఉంటాయి. సమాధానాల ఆధారంగా, సిస్టమ్ ఆదాయపు పన్ను రిటర్న్ కోసం మీరు చెల్లించాల్సిన పన్ను ఎంత అనేది లెక్కిస్తుంది.

EZTax :
ఇజెడ్‌టాక్స్ (EZTax) అనేది ఒక సెల్ఫ్ సర్వీసు అందించే పోర్టల్. పన్ను చెల్లింపుదారులు తమ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తద్వారా ఇతర అవసరమైన సమాచారంతో డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. 7 నిమిషాల్లో జరిగే ఈ ప్రక్రియలో రిటర్న్‌లను దాఖలు చేయొచ్చు. పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడమే కాదు.. పన్ను చెల్లించడానికి నిపుణులను సంప్రదించడానికి కూడా అవకాశం ఉంది.

Quicko :
క్వికో (Quicko)లో కూడా ఐటీఆర్ ఫైలింగ్ 100 శాతం ఉచితంగా అందిస్తోంది. అయితే, ముందుగా ఇందులో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. వేతన ఆదాయం ఉన్న వ్యక్తులకు ఊహాజనిత పన్ను పథకాన్ని ఎంచుకున్న వారికి ఇది ఉచితం. భారత్‌లో పన్ను చెల్లింపుదారులలో వీరిలోనే ఎక్కువ మంది ఈ పోర్టల్ ద్వారా ఫైలింగ్ చేస్తున్నారు.

Tax2win :
టాక్స్2విన్ (Tax2win) అనేది మరో e-ఫైలింగ్ పోర్టల్. పన్ను చెల్లింపుదారులు ఉచితంగా ITR దాఖలు చేసేందుకు అనుమతిస్తుంది. వినియోగదారులు ముందుగా ఇందులో లాగిన్ అవ్వాలి లేదా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.

Read Also : IT Returns Refund : ITR ఫైలింగ్ అయ్యాక రీఫండ్ ఎప్పటి లోపు వస్తుంది? ఎలా చెక్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

మీ ఆదాయ వనరులను ఎంచుకోవాలి. అవసరమైన వివరాలను సమర్పించాలి. అలాగే ఫారమ్-16ని అప్‌లోడ్ చేయాలి. పాత, కొత్త పన్ను విధానాల మధ్య ఎంచుకోవాలి. ఆపై ఆదాయపు పన్నును ఇ-ఫైల్ చేయాలి.