Income Tax Deadline : ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో ITR ఫైలింగ్ ఎలా చేయాలి? ఏయే డాక్యుమెంట్స్ కావాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Income Tax Deadline : టాక్స్ పేయర్లకు అలర్ట్.. ఆఖరి నిమిషం వరకు ఎదురుచూడకుండా వీలైనంత త్వరగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడం మంచిది. ఇప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ చాలా ఈజీ అయింది.

Income Tax Deadline : ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో ITR ఫైలింగ్ ఎలా చేయాలి? ఏయే డాక్యుమెంట్స్ కావాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

IT Returns File

Updated On : March 24, 2025 / 5:05 PM IST

Income Tax Deadline : టాక్స్ పేయర్లకు అలర్ట్.. 2024-25 ఆర్థిక సంవత్సరం అతి త్వరలో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. ఆదాయ పన్ను రిటర్న్స్‌లో తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు ఇంకా అవకాశం ఉంది.

పన్ను చెల్లింపుదారులను 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు రిటర్నులను ఈ మార్చి 31లోపు అప్‌డేట్ చేసుకోవాలి. ఐటీఆర్ ఫైలింగ్ ఇంట్లోనే ఆన్‌‌లైన్‌లో చాలా ఈజీగా పూర్తి చేయవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకోవాలి. టాక్స్ పేయర్లు ఐటీఆర్ ఎలా దాఖలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!

కొత్త పన్ను విధానం పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్న అనేక మినహాయింపులు, తగ్గింపులను పొందలేరు. అయినప్పటికీ, 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాఖలు చేసిన ఐటీఆర్‌లో దాదాపు 74శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు.

ఐటీఆర్ దాఖలుకు లాస్ట్ డేట్ ఇదే :
వేతనం పొందే ఉద్యోగుల కోసం ఐటీఆర్ ఫారం 16 అందుబాటులో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25) ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ మార్చి 31, 2025 చివరి తేదీగా నిర్ణయించింది. మీకు ఎక్కువ సమయం లేదని గమనించాలి. చివరి నిమిషంలో తొందరపడకుండా ఇప్పుడే మీ పన్నులను దాఖలు చేయండి. తద్వారా భవిష్యత్తులో ఐటీ నోటీసులు, జరిమానాలను నివారించవచ్చు.

ఐటీఆర్ దాఖలుకు అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇవే :
ముందుగా, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను రెడీగా మీ వద్ద ఉంచుకోండి. ఐటీఆర్ దాఖలు చేసే ముందు మీరు ఫారం 16, TDS సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పెట్టుబడి రుజువు (పన్ను మినహాయింపు క్లెయిమ్), బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి వడ్డీ రుజువు వంటి అవసరమైన డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకోవాలి.

ITR ఫారమ్ ఏది ఎంచుకోవాలి? :
టాక్స్ పేయర్లు ఆదాయపు పన్నుకు సంబంధించి 4 రకాల ఫారాలను పొందవచ్చు. అందులో ITR -1 (సహజ్ ), ITR-2, ITR-3, ITR -4 (సుగామ్ ) ఉన్నాయి.

Read Also : Google Maps : యూజర్లకు గూగుల్ షాక్.. ఆ డేటా పొరపాటున డిలీట్ కొట్టేసిన గూగుల్.. ఇప్పుడు ఆ డేటా కావాలంటే..!

ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఎలా దాఖలు చేయాలి? :

  • ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ (https://www.incometax.gov.in/iec/foportal/)కి వెళ్లండి.
  • ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ పాన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి Continue బటన్ క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఇ-ఫైలింగ్ అకౌంట్లలో లాగిన్ తర్వాత డాష్‌బోర్డ్‌పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ “e-File” > “Income Tax Return” > “File Income Tax Return” పై క్లిక్ చేయండి.
  • రిటర్న్ దాఖలు చేసేందుకు ITR ఫారమ్‌ను ఎంచుకుని వివరాలను నింపండి.
  • మీ ఆదాయం, డిడెక్షన్లు, పన్ను విధించే ఆదాయం వంటి వివరాలను నింపండి.
  • మీరు చెల్లించాల్సిన పన్ను ఎంత అనేది ఇక్కడ లెక్కించాలి.
  • మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పన్ను చెల్లించవచ్చు.
  • ఆధార్ నంబర్, ఈ-సైన్ ఉపయోగించి ఐటీఆర్ రిటర్న్‌ను ధృవీకరించండి.
  • ఏదైనా తప్పు ఉంటే.. వెంటనే సరిదిద్దండి. ఆపై Submit బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ ITR సమర్పించిన తర్వాత మీరు ITR రసీదును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్తు రికార్డుల కోసం ఈ రసీదు దగ్గర ఉంచుకోండి.
  • మీ ఆదాయపు పన్ను రిటర్న్ స్టేటస్, రసీదు సంఖ్య ద్వారా ఈజీగా ట్రాక్ చేయవచ్చు.