Google Maps : యూజర్లకు గూగుల్ షాక్.. ఆ డేటా పొరపాటున డిలీట్ కొట్టేసిన గూగుల్.. ఇప్పుడు ఆ డేటా కావాలంటే..!

Google Maps : గూగుల్ మ్యాప్స్ పొరపాటున కొంతమంది యూజర్ల టైమ్‌లైన్ డేటాను డిలీట్ చేసింది. అయితే, ఈ డేటా తిరిగి పొందడం కష్టమే. క్లౌడ్ బ్యాకప్‌ ఎనేబుల్ చేసిన వారికి మాత్రమే రికవరీ సాధ్యమవుతుంది.

Google Maps : యూజర్లకు గూగుల్ షాక్.. ఆ డేటా పొరపాటున డిలీట్ కొట్టేసిన గూగుల్.. ఇప్పుడు ఆ డేటా కావాలంటే..!

Google Maps Timeline

Updated On : March 24, 2025 / 3:05 PM IST

Google Maps : అరే.. గూగుల్ మ్యాప్స్‌కు ఏమైంది. సెర్చ్ దిగ్గజం గూగుల్ ఇలా చేసేందేంటి? ఎందుకు సడన్‌గా టైమ్‌లైన్ డేటా అదృశ్యమైంది. ఇటీవలే చాలామంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. అసలేం జరుగుతుందో తెలియ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also : AC Safety Tips : బిగ్ అలర్ట్.. వేసవిలో ఏసీలు పేలుతున్నాయి జాగ్రత్త.. మీ AC ఏదైనా ఈ మిస్టేక్స్ పొరపాటున కూడా చేయొద్దు..!

ప్రపంచవ్యాప్తంగా గూగుల్ మ్యాప్స్‌లో ఈ సమస్యను వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. గూగుల్ మ్యాప్స్ యాప్‌లో టైమ్‌లైన్ డేటా అదృశ్యంతో ఒక్కసారిగా కలకలం సృష్టిస్తోంది. ఇటీవల సెర్చ్ చేసినా లేదా విజిట్ చేసిన లొకేషన్లు ఇప్పుడు హిస్టరీ నుంచి మొత్తం డిలీట్ అయిపోయాయి. దాంతో చాలా కాలంగా గూగుల్ మ్యాప్స్ అకౌంట్లలో ఈ సమస్య కనిపిస్తోంది.

ఇదే సమస్యకు సంబంధించి గూగుల్ మ్యాప్స్ యూజర్లు రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో తమ గత లొకేషన్‌లకు సంబంధించి టైమ్‌లైన్ డేటా అకస్మాత్తుగా అదృశ్యమైందని రిపోర్టు చేశారు. తాజాగా దీనిపై స్పందించిన గూగుల్ ఈ సమస్యను ధృవీకరించింది.

సాంకేతిక లోపం కారణంగా కొంతమంది యూజర్ల డేటా డిలీట్ అయినట్టుగా ధృవీకరించింది. దురదృష్టవశాత్తు.. గూగుల్ క్లౌడ్ బ్యాకప్‌లను యాక్టివేట్ చేయని యూజర్లు ఈ డేటాను తిరిగి పొందలేరని తెలిపింది. అంటే.. క్లౌడ్ బ్యాకప్ ఫీచర్‌ను ఉపయోగించిన వారు మాత్రమే ఈ డేటాను రికవరీ చేయగలరు.

యూజర్లను అలర్ట్ చేస్తున్న గూగుల్ :
గూగుల్ ప్రతినిధి జెనీవీవ్ పార్క్ దీనిపై స్పందిస్తూ..”కొంతమంది యూజర్ల టైమ్‌లైన్ డేటా డిలీట్ అయింది. దానికి కారణమైన సాంకేతిక సమస్యను గుర్తించాం. ఎన్‌క్రిప్టెడ్ టైమ్‌లైన్ బ్యాకప్‌లు ఉన్న దాదాపు ప్రతి ఒక్కరూ తమ డేటాను రీస్టోర్ చేసుకోవచ్చు.

ఒకవేళ బ్యాకప్‌లను ఎనేబుల్ చేయకపోతే ఆ యూజర్లు కోల్పోయిన డేటాను తిరిగి పొందలేరు.” అని తెలిపారు. ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం.. కొంతమంది బాధిత యూజర్లు గూగుల్ నుంచి ఇమెయిల్ ద్వారా ఈ సమస్యకు సంబంధించి మెసేజ్‌లను కూడా అందుకున్నారు. గతంలో క్లౌడ్ బ్యాకప్‌లను ఎనేబుల్ చేసి ఉంటే.. కోల్పోయిన డేటాను తిరిగి పొందవచ్చు.

క్లౌడ్ బ్యాకప్ స్టేటస్ చెక్ చేయాలంటే? :
మీ బ్యాకప్ స్టేటస్ చెక్ చేయడానికి.. iOS లేదా Androidలో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ ఐకాన్ ట్యాప్ చేయండి. “Your Timeline”కి వెళ్లి క్లౌడ్ ఐకాన్ కోసం సెర్చ్ చేయండి. క్లౌడ్ లోపల మీకు ఒక యారో కనిపిస్తుంది. అంటే.. బ్యాకప్‌లు ఆన్‌లో ఉన్నాయని అర్థం. ఒక లైన్ మాత్రమే ఉంటే.. అది ఆఫ్‌లో ఉన్నాయని గమనించాలి.

Read Also : Apple Watch : అదిరిందయ్యా Apple.. వాచ్‌కే కెమెరా, AI కూడా.. ఎప్పుడు వస్తుందంటే..?

మీ బ్యాకప్ సెట్టింగ్స్ ఎడిట్ చేసేందుకు మీరు ఐకాన్ ట్యాప్ చేయొచ్చు. గత వేసవిలో గూగుల్ మ్యాప్స్ లొకేషన్ హిస్టరీ కోసం డివైజ్ స్టోరేజీకి మారుతున్నట్లు ప్రకటించింది. దాంతో చాలామంది యూజర్లు తమ డేటాను గూగుల్ సర్వర్లలో కాకుండా ప్రైవేట్‌గా స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రైవసీని అందిస్తుంది.

డేటా కోల్పోయే పరిస్థితి ఉండదు. గూగుల్ మ్యాప్స్ యూజర్లు లొకేషన్ హిస్టరీని ఎక్స్‌పోర్ట్ చేసేందుకు వీలుంది. కానీ, క్లౌడ్ బ్యాకప్‌లను వాడకుండా టైమ్‌లైన్ డేటాను రీస్టోర్ చేసే మార్గం లేదనే చెప్పాలి.