కమింగ్ సూన్ : ఇండియాలో ఫస్ట్ Apple స్టోర్.. ఎక్కడంటే?

అమెరికన్ మల్టినేషనల్ టెక్ దిగ్గజం Apple Inc రిటైల్ స్టోర్.. ఫస్ట్ టైం ఇండియాకు రాబోతుంది. అది కూడా దేశంలోనే అతిపెద్ద వాణిజ్యనగరమైన ముంబైలో ఆపిల్ రిటైల్ స్టోర్ త్వరలో లాంచ్ కానుంది.

  • Published By: sreehari ,Published On : May 9, 2019 / 08:43 AM IST
కమింగ్ సూన్ : ఇండియాలో ఫస్ట్ Apple స్టోర్.. ఎక్కడంటే?

Updated On : May 9, 2019 / 8:43 AM IST

అమెరికన్ మల్టినేషనల్ టెక్ దిగ్గజం Apple Inc రిటైల్ స్టోర్.. ఫస్ట్ టైం ఇండియాకు రాబోతుంది. అది కూడా దేశంలోనే అతిపెద్ద వాణిజ్యనగరమైన ముంబైలో ఆపిల్ రిటైల్ స్టోర్ త్వరలో లాంచ్ కానుంది.

అమెరికన్ మల్టినేషనల్ టెక్ దిగ్గజం Apple Inc రిటైల్ స్టోర్.. ఫస్ట్ టైం ఇండియాకు రాబోతుంది. అది కూడా దేశంలోనే అతిపెద్ద వాణిజ్యనగరమైన ముంబైలో.. ఆపిల్ రిటైల్ స్టోర్ త్వరలో లాంచ్ కానుంది. దేశంలో ఎన్నో లొకేషన్లను పరిశీలించిన ఆపిల్.. షార్ట్ లిస్ట్ చేసింది. చివరికి ముంబై నగరాన్ని తమ రిటైల్ స్టోర్ కు సరైనదిగా ఎంచుకుంది. ఇప్పటివరకూ ఇండియాలో ఐఫోన్ మేకర్ కంపెనీకి చెందిన ఎలాంటి రిటైల్ స్టోర్లు లేవు. ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ అత్యంత వేగంగా దూసుకెళ్తున్న క్రమంలో టెక్ దిగ్గజం ఆపిల్ కూడా తమ మార్కెట్ ను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.

వచ్చే కొన్ని వారాల్లో క్యూపర్టినో ఆధారిత కంపెనీ తమ ఫైనల్ డిసిషన్ వెల్లడించేందుకు ప్లాన్ చేస్తోందని పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ వ్యక్తి తెలిపారు. Apple Retail Store కు సంబంధించి అంతర్గత చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు. స్థానిక అవసరాలకు తగినట్టుగా ఉండదనే కారణంతో ఆపిల్.. సొంత రిటైల్ స్టోర్లను అక్కడి దేశంలో ఓపెన్ చేయడాన్ని నిషేధించింది. ఇప్పుడు ఇండియాలో తమ మ్యానిఫ్యాక్షర్ యూనిట్లను నెలకొల్పే దిశగా రిటైల్ విస్తరణపై దేశ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఇండియాలో చైనా మొబైల్ మార్కెట్ పాపులారిటీ కారణంగా ఆపిల్ ఖరీదైన తమ ప్రొడక్టులను లాంచ్ చేయలేక పోతోంది. 

చైనా ఆండ్రాయిడ్ బేసిడ్ స్మార్ట్ ఫోన్లు షియోమీ, వివో బ్రాండ్లు భారత వినియోగదారులకు ఎంతో చౌకగా లభ్యమవుతున్నాయి. ఇండియాలోనే తమ స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా ఇంపొర్టెట్ ఫోన్లపై 20 శాతం టారిఫ్ తగ్గించుకునే అవకాశం ఉంది. ‘లాంగ్ టెర్మ్ బిజినెస్ కు.. ఇండియన్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ చాలా ప్రధానమైనది. షార్ట్ టెర్మ్ బిజినెస్ కు పెద్ద సవాల్ వంటింది. మా ప్రొడక్టులను నెమ్మదిగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అని కంపెనీ వ్యవస్థాపకుడు టిమ్ కూక్ తెలిపారు.

2019 తొలి త్రైమాసకంలో ఇండియాలో 75శాతానికి పైగా ఆపిల్ షిప్ మెంట్స్ పడిపోయినట్టు ఓ రీసెర్చ్ సంస్థ కెనాలిసిస్ అంచనా వేసింది. మరోవైపు ఆపిల్.. ఇండియాలో తమ కొత్త ఐఫోన్ ఎక్స్ ఆర్ ఫోన్లపై తగిన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. రూ.17వేల తగ్గింపుతో ఐఫోన్ ఎక్స్ ఆర్ ను రూ.59వేలకే అందిస్తోంది.