భారత్‌లో అత్యంత సంపన్న యూట్యూబర్‌ ఇతడే.. ఎన్ని వందల కోట్లు సంపాదించాడంటే? మీకూ యూట్యూబ్ చానెల్ ఉందా?

దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో పాటు, జెన్-జీ వ్యూయర్స్‌ భారీగా పెరిగిపోతున్నారు.

భారత్‌లో అత్యంత సంపన్న యూట్యూబర్‌ ఇతడే.. ఎన్ని వందల కోట్లు సంపాదించాడంటే? మీకూ యూట్యూబ్ చానెల్ ఉందా?

Updated On : October 6, 2025 / 12:12 PM IST

India’s richest Youtuber: యూట్యూబ్‌ని టైమ్‌ పాస్‌ కోసం చూస్తుంటారు చాలా మంది. యూట్యూబ్ చూస్తూ టైమ్‌ వేస్ట్ చేస్తుంటారు అనేక మంది. మరికొందరు మాత్రం యూట్యూబ్‌ ద్వారానే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.

మీకు యూట్యూబ్ చానెల్‌ ఉందా? క్రియేటివ్‌గా కంటెంట్‌ ఇస్తే మీరు కూడా బాగా సంపాదించవచ్చు. లైఫ్‌స్టైల్, టెక్, కామెడీ వంటి విభాగాల్లో యూట్యూబ్ ఛానెళ్లు మొదలుపెట్టిన వారు చాలా మంది భారీగా ఆదాయాన్ని పొందుతున్నారు. ఆదాయాన్ని తెచ్చిపెట్టే డిజిటల్ వ్యాపారాలుగా ఇవి మారాయి.

భారత్‌లో అత్యంత సంపన్న యూట్యూబర్ ఎవరో ఎవరో తెలుసా? “టెక్‌ ఇన్ఫార్మర్” తెలిపిన వివరాల ప్రకారం.. కమెడియన్ తన్మయ్ భట్ భారత్‌లో అత్యంత సంపన్న యూట్యూబర్. అతడి సంపద రూ.665 కోట్లు.

టెక్ ఇన్ఫార్మర్ తమ సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని తెలుపుతూ.. “భారతదేశంలో కంటెంట్ క్రియేషన్ అనేది కొంతకాలంగా కోట్లు విలువ చేసే పరిశ్రమగా మారింది. కామెడీ నుంచి టెక్, ఎడ్యుకేషన్ నుంచి లైఫ్‌స్టైల్ వరకు క్రియేటర్లు భారీగా ఆడియన్స్‌ను సంపాదించుకుంటూ సంపద సృష్టిస్తున్నారు. ఇది డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఎంత శక్తిమంతంగా మారిందో తెలియజేస్తోంది” అని పేర్కొంది.

భారత్‌లోని టాప్ 10 యూట్యూబర్లు

  • తన్మయ్ భట్ – రూ.665 కోట్ల సంపద (అంచనా)
  • గౌరవ్ చౌధరీ (టెక్నికల్ గురూజీ) – సంపద రూ.356 కోట్లు
  • హాస్యనటుడు, చెస్ స్ట్రీమర్ సమయ్ రైనా – రూ 140 కోట్లు
  • క్యారీమినాటి (అజేయ్ నాగర్) – రూ.131 కోట్లు
  • భువన్ బామ్ (బీబీ కి వైన్స్) – రూ.122 కోట్లు
  • అమిత్ భడానా – రూ.80 కోట్లు
  • ట్రిగ్గర్డ్ ఇన్సాన్ – రూ.65 కోట్లు
  • ధ్రువ్ రాఠీ – రూ 60 కోట్లు
  • బీర్బైసెప్స్ రణవీర్ అల్లాబాదియా -రూ.58 కోట్లు
  • సౌరవ్ జోషి -రూ.50 కోట్లు

క్రియేటర్లు లైవ్ ఈవెంట్స్, బ్రాండ్‌ల కొలబరేషన్, యాడ్స్ ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు. భారత్‌లో డిజిటల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెట్ 2026 నాటికి రూ.3,000 కోట్లు దాటుతుంది. దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో పాటు, జెన్-జీ వ్యూయర్స్‌ భారీగా పెరిగిపోతున్నారు.