భారత్‌లో 5ఏళ్లలో రెట్టింపు కోటీశ్వరులు

భారత దేశంలో ఇప్పుడున్న ఆర్ధిక పరిస్దితులు అంత గొప్పగాలేవు. ఆర్ధికవ్యవస్థ ఇంకా నేల చూపులు చూస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో 30 మిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన వ్యక్తుల అత్యంత ధనవంతుల సంఖ్య తక్కువే. ఇండియాలో 2019లో అల్ట్రా హై నెట్ వర్త్ ఇన్డ్ఇవిడ్యుల్(UHNWI) 5 వేల 986 ఉండగా, 2024 నాటికి 10 వేల 354 గా ఉంటుందని ఓ స్ధానిక నివేదిక రిపోర్ట్ వెల్లడించింది. అదే సమయంలోమిలియనీయర్స్ ఆదాయం డాలర్ల పెరగనున్నట్లు నివేదిక తెలిపింది.
ప్రపంచంలోని UHNWI లో భారతదేశం వృద్ధి రేటు అత్యధికంగా 73 శాతంగా పెరుగనున్నండగా, 2024 నాటికి HNWI ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా. UHNWI వృద్ధి రేటు యూకేలో రెండు రెట్లు ఎక్కవ, యూఎస్ లో మూడు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది చైనా కంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం చైనాలో UHNWI 61వేల 587. ఇండియా కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది.
భారతదేశంలో ధనవంతుల సంఖ్య 2019లో ఒక త్రైమాసికంలో 27 శాతం కంటే ఎక్కువగా తగ్గిందని వెల్త్ అడ్వైజర్స్ అన్నారు. అదే ఏడాదిలో 51 శాతం పెరుగుతుందని ఆశించారు. ఈ ఏడాదిలో 10 శాతం తగ్గుతుందని భావించినప్పటికి, మూడింట నాలుగోవంతు ఇది 73 శాతం పెరుగుతుందని ఆశిస్తున్నాం అన్నారు. అయితే ఇప్పటి నుంచి 10 నెలల్లోపు ఎవరి ఆదాయం ఎంత అని తెలుస్తుంది.