Infinix ZeroBook 13 Launch : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ జీరోబుక్ 13 సిరీస్ ల్యాప్‌టాప్.. ధర ఎంతో తెలుసా?

Infinix ZeroBook 13 Launch : ఇన్ఫినిక్స్ జెన్‌బుక్ 13 సిరీస్ ల్యాప్‌టాప్ ఆపిల్ మ్యాక్‌బుక్ మోడల్ మాదిరిగా అద్భుతమైన డిజైన్‌తో వచ్చింది. గ్రాఫిక్స్ Intel 96EU Iris Xe ఇంటిగ్రేటెడ్ GPU ద్వారా పనిచేస్తుంది. 

Infinix ZeroBook 13 Launch : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ జీరోబుక్ 13 సిరీస్ ల్యాప్‌టాప్.. ధర ఎంతో తెలుసా?

Infinix ZeroBook 13 with 13th-Gen Core i9 CPU and 32GB RAM launched in India

Updated On : July 7, 2023 / 7:55 PM IST

Infinix ZeroBook 13 Launch : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు Infinix నుంచి కొత్త ZenBook 13 ల్యాప్‌టాప్‌ వచ్చేసింది. Infinix ZenBook సిరీస్‌ అనే కొత్త ల్యాప్‌టాప్ 13th-Gen ఇంటెల్ కోర్ i9 CPU, 1TB SSD 32GB RAMని కలిగిన టాప్ మోడల్‌తో విభిన్న కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. బేస్ మోడల్ 13వ-జనరల్ ఇంటెల్ కోర్ i5 CPUని కలిగి ఉంది. అయితే, కోర్ i7 ప్రాసెసర్‌లతో మరో 2 మోడల్‌లు ఉన్నాయి. కానీ, విభిన్న మెమరీ కాన్ఫిగరేషన్‌లతో ఉన్నాయి. లుక్స్ పరంగా, Infinix ZenBook 13 సిరీస్ (Apple MacBook) మోడల్ మాదిరిగా సొగసైన డిజైన్‌ను కలిగి ఉంది. గ్రాఫిక్స్ Intel 96EU Iris Xe ఇంటిగ్రేటెడ్ GPU ద్వారా పనిచేస్తుంది. ఇందులో ప్రత్యేకమైన GPU లేదని చెప్పవచ్చు.

భారత్‌లో Infinix ZenBook 13 సిరీస్ ధర ఎంత? :
కొత్త ఇన్ఫినిక్స్ ZenBook 13 సిరీస్ 4 కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. 13వ జనరేషన్ఇంటెల్ కోర్ i5, 16GB RAM, 512GB స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 51,990 (MRP రూ. 79,990) ఉంటుంది. ఇంటెల్ కోర్ i7 మోడల్ రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 16GB RAM + 512GB స్టోరేజీ, 32GB RAM, 1TB SSD ఉంటుంది.

Read Also : Maruti Suzuki Jimny Sales : కార్ల విక్రయాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి.. జూన్‌లో 3వేల యూనిట్లకు పైగా జిమ్నీ సేల్స్..!

ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధరలు వరుసగా రూ.65,990 (MRP రూ. 99,990), రూ. 69,990 (MRP రూ. 1,19,990)గా ఉన్నాయి. కోర్ i9, 32GB RAM, 1TB SSD కలిగిన టాప్ మోడల్ ప్రారంభ ధర రూ. 81,990 (రూ. 1,49,900) ఉంటుంది. ల్యాప్‌టాప్ సిల్వర్, బ్లాక్ కలర్ మిశ్రమాన్ని కలిగి ఉంది. ఇతర ఇన్‌ఫినిక్స్ ల్యాప్‌టాప్‌ల మాదిరిగా కాకుండా మల్టీ కోలోవేస్‌లో అందుబాటులో ఉన్నాయి.

Infinix ZeroBook 13 with 13th-Gen Core i9 CPU and 32GB RAM launched in India

Infinix ZeroBook 13 with 13th-Gen Core i9 CPU and 32GB RAM launched in India

Infinix ZenBook 13 స్పెసిఫికేషన్స్ :
మెమరీ, CPU కాన్ఫిగరేషన్‌లు మాత్రమే కాకుండా.. Infinix ZenBook 13 సిరీస్ ల్యాప్‌టాప్ మొత్తం స్పెసిఫికేషన్‌లు ఎక్కువ లేదా తక్కువ పోలి ఉంటాయి. ల్యాప్‌టాప్‌లు తేలికపాటి మెటల్ ఎండ్కలిగి ఉంటాయి. 16.9mm మందాన్ని కలిగి ఉంటాయి. 15.6-అంగుళాల డిస్‌ప్లే ఫుల్-HD (1920×1080 పిక్సెల్‌లు) 100 శాతం SRGB కలర్లను అందిస్తుందని కంపెనీ తెలిపింది. Infinix సొగసైన పోర్టబుల్ డిజైన్ డిజైనర్‌లు, యూట్యూబర్‌లకు అనుకూలమైనదిగా పేర్కొంది. మొత్తం వ్యూ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచేలా కీబోర్డ్ డెక్‌లో రెండు ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు కూడా ఉన్నాయి. పోర్ట్ ఆప్షన్లలో SD కార్డ్, 3.5mm ఆడియో జాక్, రెండు USB-A 3.0, రెండు USB టైప్-C (PD ఛార్జింగ్) ఉన్నాయి.

కొత్త జీరోబుక్ సిరీస్‌కు 70Wh బ్యాటరీ సపోర్టు ఉంది. ల్యాప్‌టాప్ టైప్-C పోర్ట్ ద్వారా 100W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇన్ఫినిక్స్ ఛార్జర్‌తో, Infinix ZenBook 13 దాదాపు 2 గంటల్లో ఫుల్ ఛార్జ్‌ అవుతుంది. వినియోగదారులు 3 వేర్వేరు ఛార్జింగ్ మోడ్‌లతో విద్యుత్ వినియోగించవచ్చు. ఎకో మోడ్ బ్యాటరీ లైఫ్ పెంచడానికి బ్యాలెన్స్ మోడ్ (ఓవర్ బూస్ట్, ఎకో మోడ్ మధ్య స్థిరత్వాన్ని కొనసాగించవచ్చు. ఓవర్ బూస్ట్ మోడ్ 54W అవుట్‌పుట్ పవర్‌లో హైపర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ డివైజ్ కీలుపై రెడ్, బ్యాక్ లైట్ ఓవర్-బూస్ట్ మోడ్ యాక్టివ్‌గా ఉంటుంది.

Read Also : iPhone 14 Pro Max : ఈ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ. 5 కోట్లు.. లంబోర్ఘిని హురాకన్ ఎవో సూపర్‌ కారు కన్నా చాలా ఖరీదైనది.. ఎందుకో తెలుసా?