Investments In Realty Sector
Investments In Realty Sector : అఫర్డబుల్ హౌజింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్‌ను చెప్పొచ్చు. అయితే గత ఏడాది కాలం నుంచి హైదరాబాద్‌లో ప్రాపర్టీస్ వాల్యూ భారీగా పెరుగుతోంది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు తక్కువగానే ఉన్నాయి.
అయితే వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్‌లోని చాలా ప్రాంతాల్లో గత ఏడాదిగా ప్రాజెక్టుల విలువలో ఘననీయమైన వృద్ధి నమోదైంది. ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న రేటు… ప్రాపర్టీ హ్యాండోవర్ చేసే సమయానికి ఎస్‌ఎఫ్‌టీ వెయ్యి నుంచి 15వందల రూపాయల వరకు పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ విలువ మరింత ఎక్కువగా ఉంది.
దూసుకుపోతున్న హైదరాబాద్ ఆస్తుల విలువ :
దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ హౌజింగ్ ప్రాపర్టీల విలువలో భారీ వృద్ధి నమోదైంది. గత ఏడాది కాలంలో ముంబైలో ప్రాపర్టీ విలువలో వృద్ధి 3శాతం ఉండగా… హైదరాబాద్‌లో 6శాతం గ్రోత్ నమోదైంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో హౌజింగ్ ప్రాపర్టీల డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. గత ఏడాది కాలంలో ఇండిపెండెంట్ ఇళ్లు, ఓపెన్ ల్యాండ్స్, ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి.
జీహెచ్‌ఎంసీ ఈస్ట్, వెస్ట్‌జోన్లలో భారీ వృద్ధి :
జీహెచ్‌ఎంసీ ఈస్ట్, వెస్ట్‌జోన్లలో భారీ వృద్ధి నమోదైంది. ఇతర పెట్టుబడులతో పోలిస్తే రియాల్టీ రంగంలో చక్కని అప్రిషియేషన్ ఉండటంతో… ఈ సెక్టార్‌లో పెట్టుబడి పెట్టేందుకు బయ్యర్స్ ఉత్సాహపడుతున్నారని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక పెరుగుతోన్న ప్రాపర్టీ ధరలకు అనుగుణంగా డెవలపర్స్ నిర్మాణాలను సిద్ధం చేస్తున్నారు. నిర్మాణాలు ప్రారంభించే సమయంలోనే డెలివరీ టైమ్‌లో ప్రాపర్టీ విలువ ఎంతో అవుతుందో చెబుతున్నారు. మరికొన్ని సంస్థలు మొత్తం అమౌంట్ ముందుగానే చెల్లిస్తే.. తక్కువ ధరకే ప్రాపర్టీలు విక్రయిస్తున్నాయి.
Read Also : Hyderabad Real Estate : రియల్ ఇన్‌కమ్.. టీ-సర్కార్‌కు కాసుల పంట.. భారీగా ఆదాయం ఇక్కడి నుంచే..!