Market Wrap: గత 7 ట్రేడింగ్ సెషన్లలో పెట్టుబడిదారుల రూ.16 లక్షల కోట్ల సంపద ఆవిరి

ఆర్థిక మాంద్యం, కరోనా విజృంభణ భయాలతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాటన పయనిస్తున్నాయి. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో పెట్టుబడిదారుల రూ.16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోయి 60,137 (సైకలాజికల్ మార్క్ ఇంట్రాడే-60,000) వద్ద కొనసాగింది.

Market Wrap

Market Wrap: ఆర్థిక మాంద్యం, కరోనా విజృంభణ భయాలతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాటన పయనిస్తున్నాయి. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో పెట్టుబడిదారుల రూ.16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోయి 60,137 (సైకలాజికల్ మార్క్ ఇంట్రాడే-60,000) వద్ద కొనసాగింది.

అదే సమయానికి నిఫ్టీ50 సూచీలో కీలకమైన 18,000 మార్కు తగ్గింది. 220 పాయింట్లు నష్టపోయి 17,907 వద్ద కొనసాగింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2 పాయింట్లకు పైగా తగ్గింది. స్మాల్‌క్యాప్ ఇండెన్స్ దాదాపు 3 శాతం వద్ద కొనసాగింది. వడ్డీ రేట్లు అధికంగానే ఉంటాయన్న అంచనాలు, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ఆందోళనలకు తోడు పలు దేశాల్లో కరోనా భయాలు నెలకొనడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.

ఇవాళ మధ్యాహ్నం బీఎస్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 275.01 లక్షల కోట్లకు దిగజారింది. గత సెషన్ లో ఇది రూ.280.55 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడురోజుల తీరును గమనిస్తే ఆయా సెషన్లలో రూ.16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది.

డిసెంబరు 14 నుంచి బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నేడు ఆ విలువ రూ. 275.01 లక్షల కోట్లుగా ఉంది. డిసెంబరు 14 ఈ విలువ రూ.291.25 కోట్లుగా ఉంది. గత ఏడు ట్రేడింగ్ రోజుల్లో సూచీలు దాదాపు 4 శాతం పడిపోయాయి.

Best Smartwatches in 2022 : 2022 ఏడాదిలో రూ. 5వేల లోపు చౌకైన 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌‌లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ వాచ్ ఇప్పుడే కొనేసుకోండి..!