iPhone 14 Price
iPhone 14 Price : ఆపిల్ లవర్స్ మీకోసమే.. ఐఫోన్ 14 ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే (iPhone 14 Price) ఐఫోన్ 14 లభిస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్‌ను అసలు ధర కన్నా తక్కువకే కొనేసుకోవచ్చు.
ఐఫోన్ 16e తర్వాత ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ ధర భారీగా తగ్గింది. ఐఫోన్ 15 లేదా ఐఫోన్ 16 కొనకపోతే.. ఐఫోన్ 14 ఇప్పుడే కొనేసుకోవచ్చు. ఈ ఐఫోన్ కొంచెం పాతది అయినా మంచి డిమాండ్ ఉంది. మార్కెట్లో సరసమైన ధరకే లభ్యమవుతుంది.
ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ :
అమెజాన్‌లో ఐఫోన్ 14 సిరీస్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఐఫోన్ 14 256GB మోడల్ రూ. 79,999కి విక్రయిస్తోంది. ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుత ఐఫోన్ 14 ధర కేవలం రూ. 63,900కు కొనుగోలు చేయొచ్చు.
అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా పాత స్మార్ట్‌ఫోన్‌పై రూ. 61,655 వరకు ఎక్స్ఛేంచ్ పొందవచ్చు. పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ వాల్యూ ఉంటుంది.
తద్వారా రూ. 40 వేల నుంచి రూ. 45 వేల మధ్య సేవ్ చేయొచ్చు. ఎక్స్ఛేంచ్ ఆఫర్ ద్వారా 256GB మోడల్ రూ. 20వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు.
ఐఫోన్ 14 ఫీచర్లు :
ఈ ఐఫోన్ అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్ కలిగి ఉంది. IP68 రేటింగ్ అందిస్తుంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా స్క్రీన్ డాల్బీ విజన్‌కు సపోర్టు ఇస్తుంది. డ్యామేజ్‌లేకుండా డిస్‌ప్లేకు సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ అందిస్తుంది. iOS16తో ప్రీ ఇన్‌స్టాల్‌తో వస్తుంది.
ఈ ఐఫోన్‌తో పాటు ఆపిల్ A15 బయోనిక్ చిప్‌సెట్‌ను చేర్చింది. 512GB వరకు స్టోరేజీ, 6GB ర్యామ్ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 12+12MP కెమెరాతో అద్భుతమైన డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఐఫోన్ పెద్ద 3279mAh బ్యాటరీతో వస్తుంది.