iPhone 15 Price
iPhone 15 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. ఐఫోన్ 15 అత్యంత సరసమైన ధరకే వస్తోంది. 2023లో ఐఫోన్ 15 రూ.79,900కి లాంచ్ అయింది. అయితే, ఇప్పుడు ఐఫోన్ 15 (128GB) వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
రూ.18,500 ధర తగ్గింపుతో పాటు, ఎక్స్ఛేంజ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లతో లభ్యమవుతుంది. ఈ ఐఫోన్ భారతీయ కొనుగోలుదారులకు మరింత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ ఐఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 15 ధర డిస్కౌంట్ :
అమెజాన్‌లో ఐఫోన్ 15 (128GB) ధర అసలు రూ.79,900 నుంచి కేవలం రూ.61,400కి తగ్గింది. అంటే.. నేరుగా రూ.18,500 డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీరు పాత స్మార్ట్‌ఫోన్ ద్వారా ఐఫోన్ 15 ధర ఇంకా తగ్గించుకోవచ్చు. కానీ, మీ పాత ఫోన్ మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉండాలి. ఒకవేళ మీరు ఐఫోన్ 13తో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ.28,450 వరకు తగ్గింపు పొందవచ్చు. దాంతో ఐఫోన్ 15 ధర కేవలం రూ.32,950కి తగ్గుతుంది.
ఐఫోన్ 15 కీ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఐఫోన్ 15 సిరామిక్ షీల్డ్ ఫ్రంట్, అల్యూమినియం బాడీ, వాటర్, ధూళి నిరోధకతకు IP68 రేటింగ్‌తో పాలిష్ చేసిన డిజైన్‌ను అందిస్తుంది. డైనమిక్ ఐలాండ్, డాల్బీ విజన్, 2వేల నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా A16 బయోనిక్ చిప్ ద్వారా పవర్ పొందుతుంది.
ఐఫోన్ 14ప్రో మోడల్‌లలో ఉన్న అదే ప్రాసెసర్ ఉంది. ఈ ఐఫోన్ iOS 18.2.1పై రన్ అవుతుంది. 512GB వరకు స్టోరేజ్ వేరియంట్లను అందిస్తుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. 12MP ఫ్రంట్ కెమెరా హై క్వాలిటీ సెల్ఫీలు, వీడియో కాలింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వై-వై 6, బ్లూటూత్ 5.3తో కూడా వస్తుంది. వైర్డు, మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్టు ఇస్తుంది.
ఐఫోన్ 15 కొనాలా? వద్దా? :
ఆపిల్ ఐఫోన్ 16 ఇప్పటికే లాంచ్ అయింది. కానీ, ఐఫోన్ 15 అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో కెమెరా సెటప్‌ను అందిస్తుంది. లేటెస్ట్ ఫీచర్లు అవసరం లేని వారికి ఆపిల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. ప్రస్తుత ఐఫోన్ 15 డీల్ ఐఫోన్ 16 కన్నా బెటర్ ఆప్షన్. అది కూడా తక్కువ ధరలో ఐఫోన్ కొనేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.