ITR Filing Rules
ITR Filing Rules : మీ జీతం ఎంత? వార్షిక ఆదాయం ఎంత? వ్యాపారపరంగా లేదా ఇతర మార్గాల్లో ఎంత ఆదాయం వస్తుంది? తక్కువ ఆదాయం ఉంటే టాక్స్ కట్టాల్సిన పనిలేదా? చాలామంది తమకు ఆదాయం తక్కువగా ఉంది కదా పన్ను పరిధిలోకి లేరని, అలాంటప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడం ఎందుకని భావిస్తుంటారు.
కానీ, తక్కువ జీతం ఉన్నప్పటికీ లేదా పన్ను చెల్లించపోయినా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ కొత్త రూల్స్ ప్రకారం.. ఇకపై ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అది కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవసరం ఉంటుంది.
కొన్నిసార్లు చట్టబద్ధంగా తప్పనిసరి కూడా. పన్ను చెల్లించాల్సిన పరిమితి కన్నా తక్కువ జీతం ఉన్నప్పటికీ మీరు ఏయే సందర్భాలలో ITR దాఖలు చేయాల్సి వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఏయే సందర్భాలలో ITR దాఖలు చేయడం తప్పనిసరి? :
1. సేవింగ్స్ అకౌంట్లలో రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినప్పుడు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్లలో మొత్తం రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసి ఉంటే.. మీ జీతం పన్ను పరిధిలోకి రాకపోయినా మీరు ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి.
2. కరెంట్ అకౌంట్లలో రూ. కోటి కన్నా ఎక్కువ మొత్తం ఉంటే కూడా ఐటీఆర్ దాఖలు చేయాలి. ఒక వ్యక్తి కరెంట్ అకౌంటులో రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే.. ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. ఈ ఐటీ రూల్ వ్యాపార సంస్థలకు వర్తించదు.
3. రూ. 60 లక్షల కన్నా ఎక్కువ వ్యాపార టర్నోవర్ ఉంటే కూడా ఐటీఆర్ దాఖలు చేయాలి. ఒక వ్యక్తి వార్షిక వ్యాపార టర్నోవర్ రూ. 60 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే.. లాభం ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
4. రూ. 10 లక్షల కన్నా ఎక్కువ వృత్తిపరమైన ఆదాయం కలిగి ఉంటే కూడా ఐటీఆర్ చేయాల్సిందే. ఎవరైనా డాక్టర్, న్యాయవాది, చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఫ్రీలాన్సర్ వంటి ప్రొఫెషనల్‌గా పనిచేస్తూ తమ ఆదాయం రూ. 10 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి.
5. మొత్తం విద్యుత్ బిల్లు రూ. లక్ష కన్నా ఎక్కువ ఉంటే కూడా ఐటీఆర్ దాఖలు చేయాలి. మీ విద్యుత్ బిల్లులు ఒక ఏడాదిలో రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కూడా ఐటీఆర్ దాఖలు చేయాలి.
6. రూ. 25వేల కన్నా ఎక్కువ TDS లేదా TCS ఉన్నా కూడా వర్తిస్తుంది. ఒక ఏడాదిలో మీ ఆదాయం నుంచి మొత్తం రూ. 25వేలు లేదా అంతకంటే ఎక్కువ TDS లేదా TCS తొలగిస్తే.. (సీనియర్ సిటిజన్లకు పరిమితి రూ.50వేలు) అప్పుడు కూడా మీరు రీఫండ్ క్లెయిమ్ కోసం ఐటీఆర్ దాఖలు చేయాలి.
7. విదేశాల్లో ఆస్తి లేదా బ్యాంకు అకౌంటు ఉంటే కూడా ఐటీఆర్ దాఖలు చేయాలి. మీకు విదేశాల్లో ఏదైనా ఆస్తి ఉంటే.. విదేశీ బ్యాంకు ఖాతాకు యజమాని లేదా సంతకం చేసే అధికారం ఉంటుంది. అది యాక్టివ్‌గా లేకపోయినా ఇలాంటి సందర్భంలో ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
8. విదేశీ ప్రయాణానికి రూ. 2 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే కూడా ఐటీఆర్ దాఖలు చేయాలి. మీ కోసం లేదా వేరొకరి విదేశీ ప్రయాణానికి రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసి ఉంటే.. ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి.
ITR ఫైలింగ్ వల్ల కలిగే ప్రయోజనాలివే :
ఆదాయపు పన్ను పరిమితి ఎంతంటే? :
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే ముందు.. మీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక మినహాయింపు పరిమితిని నిర్ణయించింది.
Read Also : IT Notices : బిగ్ అలర్ట్.. ఈ 10 లావాదేవీలపై ఐటీ నిఘా.. ఏ క్షణమైన మీ ఇంటికి IT నోటీసులు రావొచ్చు..!
పాత పన్ను విధానం ప్రకారం.. 60 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు రూ. 2.5 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వయస్సు గల సీనియర్ సిటిజన్లు రూ. 3 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
80 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, కొత్త పన్ను విధానం ప్రకారం.. వయస్సు ఎంత ఉన్నా, ప్రతి వ్యక్తికి రూ. 3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
కొన్నిసార్లు కొన్ని అదనపు మినహాయింపులు, రాయితీల కారణంగా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ, పన్ను పరిధిలో లేరని ఉండకుండా ఐటీఆర్ దాఖలు చేయడం అన్నివిధాలుగా ఉత్తమం.