ITR Filling : టాక్స్ పేయర్లకు అలర్ట్.. ITR ఫైలింగ్‌లో ఈ మిస్టేక్ చేశారా? అర్జంట్‌గా ఇలా కరెక్ట్ చేసుకోండి.. పెనాల్టీలు, ఐటీ నోటీసులు రావు..!

ITR Filling : టాక్స్ పేయర్లు ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో పొరపాట్లు చేస్తుంటారు. వెంటనే కరెక్ట్ చేసుకోవాలి. లేదంటే పెనాల్టీలు చెల్లించకతప్పదు.

ITR Filling : టాక్స్ పేయర్లకు అలర్ట్.. ITR ఫైలింగ్‌లో ఈ మిస్టేక్ చేశారా? అర్జంట్‌గా ఇలా కరెక్ట్ చేసుకోండి.. పెనాల్టీలు, ఐటీ నోటీసులు రావు..!

ITR Filling

Updated On : July 28, 2025 / 1:31 PM IST

ITR Filling : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఈ తప్పులు అసలు చేయొద్దు.. లేదంటే మీకు ఐటీ నోటీసులు ఎప్పుడైనా (ITR Filling) రావచ్చు. చాలామంది ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.

ఇలాంటి తప్పులు దొర్లినప్పుడు వెంటనే సవరించుకునే అవకాశం కూడా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం అంటే.. 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025గా నిర్ణయించారు. ఈ తేదీని పొడిగించినప్పటికీ టాక్స్ పేయర్లు చివరి క్షణం వరకు వేచి ఉండొద్దు.

పేపర్ వర్క్, టెక్నికల్ ఇష్యూ, కొన్నిసార్లు పోర్టల్ లోపాల కారణంగా రిటర్న్ దాఖలు ప్రక్రియ చాలా క్లిష్టంగా మారుతుంది. ముఖ్యంగా ITR-1, ITR-4 ఫారమ్‌లతో ఫైలింగ్ దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు ఆలస్యం చేయకుండా రిటర్న్‌లను దాఖలు చేయాలి.

ఎందుకంటే.. ఈ ఫారమ్‌ల ఆన్‌లైన్ ఎక్సెల్ యుటిలిటీ ఇప్పటికే విడుదల అయింది. కానీ, మీరు తొందరపడి రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు తప్పులు చేసినా.. ఆదాయ వనరును కోల్పోవడం లేదా ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని తప్పుగా ఎంటర్ చేయడం వంటివి చేస్తే ఆందోళన అవసరం లేదు. మీరు మీ రిటర్న్‌ను చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు.

Read Also : Flipkart Freedom Sale : ఆగస్టులో ఫ్లిప్‌కార్ట్ మరో బిగ్ సేల్.. స్మార్ట్ ఫోన్లు, ఏసీలు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లపై అదిరే డీల్స్.. గెట్ రెడీ..!

తప్పులుంటే వెంటనే సరిదిద్దండి.. లేదంటే నోటీసులు రావొచ్చు :
రిటర్న్‌లో చేసిన తప్పులు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయ మూలాన్ని దాచడం లేదా బ్యాంక్ అకౌంట్ రాంగ్ నంబర్‌ను సమర్పించడం వంటివి. కానీ, మీరు సకాలంలో తప్పును గుర్తిస్తే.. డిసెంబర్ 31, 2025 నాటికి సవరించిన రిటర్న్‌ను దాఖలు చేసి తద్వారా మీరు ఆదాయపు పన్ను నోటీసు రాకుండా నివారించవచ్చు.

టాక్స్ పేయర్లు తరచుగా చేసే సాధారణ తప్పులివే :

  • రాంగ్ ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం
  • వ్యక్తిగత సమాచారంలో తప్పులు
  • బ్యాంకు అకౌంట్ వివరాలలో తప్పులు
  • అన్ని ఆదాయ వనరులను వెల్లడించకపోవడం
  • అర్హత కలిగిన డిడెక్షన్లను క్లెయిమ్ చేయకపోవడం
  • మీ వద్ద డాక్యుమెంట్లు లేని డిడెక్షన్లను క్లెయిమ్ చేయడం

ITRలో తప్పులను ఎలా ఎడిట్ చేయాలి? :

  • రిటర్న్‌ను సవరించేందుకు ముందుగా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
  • ఆ తర్వాత ‘E-file’ ట్యాబ్‌కి వెళ్లండి.
  • ‘File Income Tax Return’ ఆప్షన్ ఎంచుకోండి.
  • సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం (2025-26)ని ఎంచుకోవాలి.
  • ‘సెక్షన్ 139(5) కింద సవరించిన రిటర్న్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

అయితే, సవరించిన రిటర్న్‌ను దాఖలు చేసే సమయంలో గతంలో దాఖలు చేసిన రిటర్న్ రసీదు నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు రిటర్న్‌ను ఆఫ్‌లైన్‌లో అంటే.. పేపర్ మోడ్‌లో దాఖలు చేసి ఉంటే.. 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇలా చేయవచ్చు. అప్పుడు రిటర్న్స్ సవరణను కూడా పేపర్ మోడ్‌లోనే చేయాల్సి ఉంటుంది.

రిటర్న్‌ను సవరించడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2025 వరకు సమయం ఉంది. మీరు రిటర్న్‌ను ఒకటి కన్నా ఎక్కువసార్లు సవరించవచ్చు. దీనికి ఎలాంటి అదనపు రుసుము లేదా పెనాల్టీ లేదు. మీ రీఫండ్ ప్రాసెస్ చేసినప్పటికీ మీరు ఇప్పటికీ సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. అయితే, ఒరిజినల్ రిటర్న్‌ను వెరిఫై చేయడం తప్పనిసరి అయినట్లే.. రిటర్న్‌ను దాఖలు చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు సవరించిన రిటర్న్‌ను వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యం.