IT Notices : బిగ్ అలర్ట్.. ఈ 10 లావాదేవీలపై ఐటీ నిఘా.. ఏ క్షణమైన మీ ఇంటికి IT నోటీసులు రావొచ్చు..!

IT Notices : మీ లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. కొన్ని లావాదేవీలకు సంబంధించి అనుమానం వస్తే వెంటనే ఐటీ శాఖ నోటీసులు పంపుతుంది.

IT Notices : బిగ్ అలర్ట్.. ఈ 10 లావాదేవీలపై ఐటీ నిఘా.. ఏ క్షణమైన మీ ఇంటికి IT నోటీసులు రావొచ్చు..!

IT Notices

Updated On : July 25, 2025 / 10:33 PM IST

IT Notices : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. మీ ఆదాయం ఎంత? అదేపనిగా లావాదేవీలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ ప్రతి లావాదేవీపై ఐటీ శాఖ నిఘా (IT Notices) పెట్టింది. మీ లావాదేవీల్లో ఏది తేడా ఉన్నా ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసులు పంపవచ్చు. ప్రత్యేకించి ఈ 10 లావాదేవీలపై నిఘా పెడుతోంది. చాలా మంది ఆదాయపు పన్ను ఆదా కోసం రిటర్నులు దాఖలు చేసేటప్పుడు తక్కువ ఆదాయాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తారు..

మీరు తక్కువ ఆదాయం, ఎక్కువ ఖర్చును చూపించినట్లయితే.. ఆదాయపు పన్ను శాఖ కచ్చితంగా మీకు నోటీసులు పంపుతుంది. ఆదాయపు పన్ను శాఖ నిశితంగా పరిశీలించి ఏదైనా సందేహం ఉంటే వెంటనే మీకు నోటీసు పంపుతుంది. ఇంతకీ ఆ 10 లావాదేవీలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1 : రిటర్న్ దాఖలు చేయకుండా పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేయడం :
మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లో తక్కువ ఆదాయాన్ని చూపించి బ్యాంకులో పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంటే కూడా మీకు ఐటీ నోటీసులు రావచ్చు.

2 : క్రెడిట్ కార్డు ద్వారా భారీగా ఖర్చు చేయడం :
ఒక ఏడాదిలో మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తే.. మీకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ఐటీ శాఖ అడగవచ్చు. మీరు ఎందుకో కారణాన్ని ప్రూఫ్‌తో చూపించాలి.

3 : ITR, ఫారం 26AS మధ్య తేడా ఏంటి? :
మీ ITR, ఫారమ్ 26AS లేదా AIS మధ్య తేడా ఉంటే మీకు ఐటీ నోటీసులు అందవచ్చు. అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ITR దాఖలు చేసే ముందు ఈ ఫారమ్‌లను చెక్ చేయండి.

4 : లెక్కలు లేకుండా ఆస్తులు కొనడం లేదా అమ్మడం :
మీరు ఒక ఏడాదిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ఉంటే లేదా అనేకసార్లు ఆస్తిని కొనుగోలు చేసి లేదా విక్రయించి ఉంటే.. మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు అందవచ్చు. ఆస్తిపై వచ్చిన డబ్బు, అమ్మడం ద్వారా వచ్చిన నగదు లెక్కను మీరు ఆదాయపు పన్ను శాఖకు తప్పనిసరిగా తెలియజేయాలి.

5 : బ్యాంక్ FD, సేవింగ్స్ అకౌంట్లలో భారీగా లావాదేవీలు :
మీరు పెద్ద మొత్తంలో FD చేస్తే లేదా అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు సేవింగ్స్‌లో డిపాజిట్ అయినట్లు తెలిస్తే.. మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వస్తుంది. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో మీరు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది.

Read Also : CIBIL Faster Loans : అమ్మయ్యా.. ఇక CIBIL స్కోరు చెకింగ్ ఉండదా? లోన్లు ఈజీగా వస్తాయా? కొత్త క్రెడిట్ రూల్స్ ఏంటి?

6 : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం :
మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా IPOలో భారీ పెట్టుబడులు లేదా లాభాలను చూపిస్తే కూడా ఐటీ నోటీసు రావచ్చు. అయితే, మీరు సరైన ఆదాయ వనరులను వెల్లడిస్తే.. ఆదాయపు పన్ను శాఖ అంగీకరిస్తుంది.

7 : వడ్డీ లేదా అద్దె ఆదాయాన్ని దాచడం :
మీరు ఐటీఆర్‌లో FD వడ్డీ లేదా అద్దె ఆదాయాన్ని చూపించకపోతే.. మీకు నోటీసు రావచ్చు. చాలా మంది అనుకోకుండా వడ్డీ ఆదాయాన్ని చూపించడం మర్చిపోతారు.

8 : విదేశీ ప్రయాణాలకు భారీగా ఖర్చు :
మీరు విదేశీ ప్రయాణాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి తక్కువ ఆదాయాన్ని చూపిస్తే.. ఐటీ శాఖ విచారించవచ్చు.

9 : అద్దెకు ఇల్లుపై TDS క్లెయిమ్ చేయకపోవడం :
మీరు అద్దె ద్వారా చాలా సంపాదించి TDS చూపించకపోతే.. ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని అనుమానించవచ్చు.

10 : రూ. 2 లక్షలకు పైగా క్యాష్ :
రూ. 2 లక్షల కన్నా ఎక్కువ విలువైన వస్తువును క్యాష్ రూపంలో కొనుగోలు చేస్తే ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ కావచ్చు. ఆ తర్వాత ఆదాయపు పన్ను శాఖ కచ్చితంగా నోటీసు పంపుతుంది.