Jeep Meridian 2025 : టయోటా, ఎంజీ గ్లోస్టర్‌కు పోటీగా జీప్ మెరిడియన్ 2025 వచ్చేసిందోచ్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
Jeep Meridian 2025 Launch : జీప్ మెరిడియన్ 2025 మోడల్ 4 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అందులో లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (ఓ), ఓవర్‌ల్యాండ్ ఉన్నాయి.

Jeep Meridian 2025
Jeep Meridian 2025 Launch : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం జీప్ ఇండియా నుంచి సరికొత్త మోడల్ జీప్ ప్రవేశపెట్టింది. జీప్ మెరిడియన్ 2025 పేరుతో మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ జీప్ మెరిడియన్ ప్రారంభ ధర రూ. 24.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద తీసుకొచ్చింది. కొత్త అప్‌డేట్ అవతార్‌లో ఎస్‌యూవీ 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్‌లకు పోటీదారుగా కంపెనీ ప్రవేశపెట్టింది.
స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. జీప్ ఎస్‌యూవీ అదే 2.0-లీటర్, 4-సిలిండర్, టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది. 170హెచ్‌పీ 350ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కలుపుకోవచ్చు. 4X2, 4X4 ఆప్షన్లు ఉన్నాయి.
జీప్ మెరిడియన్ మైలేజ్ 16.25kmpl (ARAI) వరకు ఉంటుంది. జీప్ మెరిడియన్ 2025 మోడల్ 4 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అందులో లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (ఓ), ఓవర్‌ల్యాండ్ ఉన్నాయి. ప్రతి ట్రిమ్ ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.
- జీప్ మెరిడియన్ లాంగిట్యూడ్ : రూ 24.99 లక్షలు
- జీప్ మెరిడియన్ లాంగిట్యూడ్ ప్లస్ : రూ. 27.50 లక్షలు
- జీప్ మెరిడియన్ లిమిటెడ్ (O) : రూ. 30.49 లక్షలు
- జీప్ మెరిడియన్ ఓవర్‌ల్యాండ్ : రూ. 36.49 లక్షలు
ఫ్రంట్ సైడ్ ఎస్‌యూవీ బోల్డ్ సెవెన్-స్లాట్ గ్రిల్‌ను కలిగి ఉంది. ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ శాటిన్ క్రోమ్ యాక్సెంట్‌లతో ఎల్ఈడీ టెయిల్‌లైట్లు ఉన్నాయి. జీప్ మెరిడియన్ 2025 క్యాబిన్‌లో వేగన్ లెదర్ (లాంగిట్యూడ్ ట్రిమ్‌లో వినైల్ ఫాబ్రిక్), కాపర్ స్టిచింగ్‌తో స్వెడ్/వేగన్ లెదర్ యాక్సెంట్‌లు ఉన్నాయి.
ఎలక్ట్రిక్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, 10.25-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల ఫుల్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌తో ఇంటర్నల్ నావిగేషన్, ఆపిల్ కార్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో వైర్‌లెస్ మిర్రరింగ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
యూకనెక్ట్‌తో జీప్ మెరిడియన్ 2025 జీఎస్‌డీపీ 2.0 కనెక్టివిటీ ప్రోటోకాల్‌తో 30 కన్నా ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంది. ఆటోమేటిక్ ఎస్ఓఎస్ కాల్, రిమోట్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ విత్ ఏసీప్రీకాండిషనింగ్, అలెక్సా హోమ్ టు వెహికల్, స్మార్ట్‌వాచ్ ఎక్స్‌టెన్షన్, అలర్ట్‌తో కూడిన వాహన ఆరోగ్య నివేదిక, లైవ్ ట్రాఫిక్‌తో కనెక్ట్ చేసిన వన్-బాక్స్ నావిగేషన్ సెర్చ్, వెదర్, ఇన్సిడెంట్ అప్‌డేట్, ఓటీఏ వంటి కొన్ని ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.
లగేజీ స్థలానికి సంబంధించినంతవరకు 2 వరుసలు మడతపెట్టి 824 లీటర్లు, 5 వ్యక్తులతో 481 లీటర్లు, మొత్తం 7 సీట్లతో 170 లీటర్ల వరకు ఉంటుంది. 5 సీట్ల వేరియంట్‌లో అన్ని సీట్లతో పాటు 670 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది. జీప్ మెరిడియన్ 2025 టాప్-స్పెక్ ఓవర్‌ల్యాండ్ ట్రిమ్‌లో ఫ్రంట్ రాడార్, కెమెరా-ఆధారిత సిస్టమ్‌తో అడాస్ సూట్ ఉంది.
మీరు స్టాప్ అండ్ గోతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్ట్, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్‌తో ఫుల్ స్పీడ్ ఫార్వర్డ్ ఢీకొనే హెచ్చరిక, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, సరౌండ్ వ్యూ మానిటర్, స్మార్ట్ బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లను పొందవచ్చు.
Read Also : Bajaj Pulsar N125 Launch : కొత్త బైక్ కొంటున్నారా? బజాబ్ పల్సర్ N125 చూశారా? ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?