Kia Car Prices : కియా కస్టమర్లకు షాక్..! భారీగా పెరగనున్న కార్ల ధరలు.. ఈ తేదీలోగా బుకింగ్ చేస్తే భారీ సేవింగ్..!
Kia Car Prices : కియా ఇకపై కాస్ట్లీగా మారబోతోంది. జూలై ఒకటో తేదీ నుంచి కియా కార్ల ధరలు 2శాతం వరకు పెరగనున్నాయి. ప్రతి మోడల్ వేరియంట్ ధర ఎంత పెంచనుందో కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.. పూర్తి వివరాలివే..
Kia Car Prices
Kia Car Prices : కియా కస్టమర్లకు బిగ్ షాక్.. జూలై ఫస్ట్ నుంచి కియా కార్ల ధరలు పెరగనున్నాయి. వచ్చే నెలలో కొత్త కియా కార్లను కొనాలంటే ఇక ఎక్కువ డబ్బులు దగ్గర పెట్టుకోవాల్సిందే.. కంపెనీ మొత్తం మోడల్ రేంజ్ ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది.
కియా కార్ల ధరలు 2 శాతం వరకు పెరగనున్నాయి. ఈ ధరల పెంపు కంపెనీ పెట్రోల్, డీజిల్ ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తిస్తుంది. ఏ మోడల్, ఏ వేరియంట్ ధర ఎంత పెరుగుతుందో కియా ఇంకా స్పష్టం చేయలేదు. కొత్త ధరలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని త్వరలోనే ప్రకటిస్తామని కియా తెలిపింది. కియా కార్లకు సంబంధించి వివిధ మోడళ్లు, వేరియంట్ల ప్రకారం ధరలు
కార్ల ధరల పెంపునకు కారణాలివే :
కంపెనీ ప్రకారం.. నిరంతరం పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, నిర్వహణ ఖర్చులే ధరల పెంపునకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, నిర్వహణ ఖర్చుల కారణంగా ధరల పెంపు తప్పడం లేదని కియా ఇండియా అధికారిక ప్రకటనలో తెలిపింది. పెరిగిన ఖర్చులో అధిక భాగాన్ని కంపెనీ భరించేందుకు ప్రయత్నిస్తుందని, వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు ధరల పెంపును పరిమితం చేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.
మార్కెట్లోకి ప్రవేశించిన ఏడేళ్లలోపే దేశీయ మార్కెట్లో 15 లక్షల వాహనాల అమ్మకాలతో కియా మైలురాయిని దాటింది. సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్యూవీ మొత్తం అమ్మకాలలో 41 శాతం కన్నా ఎక్కువ వాటాతో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది.
సోనెట్ కాంపాక్ట్ SUV మొత్తం అమ్మకాలలో 36శాతం వాటాను అందించగా, కాంపాక్ట్ SUV సెగ్మెంట్లలో కియా సత్తా చాటింది. అదే సమయంలో, కేరెన్స్ మల్టీ-పర్పస్ వెహికల్ అమ్మకాలలో సుమారు 20శాతం వాటాతో నిలిచింది.
కియా కారు మోడళ్లు ఇవే :
కియా ఇండియా పలు సెగ్మెంట్లలో కార్లను అందిస్తుంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో సోనెట్, సెల్టోస్, కేరెన్స్, కేరెన్స్ క్లావిస్, సిట్రోస్, కార్నివాల్, EV6 EV9 వంటి మోడళ్లు ఉన్నాయి. EV6, EV9 కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీలుగా ఉన్నాయి. సోనెట్ సెల్టోస్ కియా అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో ఉన్నాయి.
ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న ఖర్చుల ప్రభావం కేవలం కియాపై మాత్రమే కాదు.. గత కొన్ని నెలలుగా ఇతర కార్ల తయారీదారులపై కూడా పడటంతో కార్ల ధరలను భారీగా పెంచారు. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు, కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా కంపెనీలపై ఒత్తిడి పెరిగింది.
ఈ కారణంగానే కియా కన్నా ముందు టాటా మోటార్స్, బీఎండబ్ల్యూ ఇండియా, మెర్సిడెస్-బెంజ్, మారుతి సుజుకి, హ్యుందాయ్ నిస్సాన్ వంటి కంపెనీలు కూడా వాహనాల ధరలను పెంచాయి. మారుతి సుజుకి ఇటీవల కార్ల ధరలను రూ. 30వేల వరకు పెంచింది. ఈ పెంపు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా జూన్ 1 నుంచి రూ. 12,800 వరకు కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ తేదీలోగా కారు కొనండి :
కొత్త కియా ఎస్‌యూవీని కొనేందుకు చూస్తుంటే జూలై 1వ తేదీ లోపు బుక్ చేసుకోవడం బెటర్. ధరల పెంపు అమల్లోకి వచ్చాక దాదాపు అన్ని కార్లు గతంలో కన్నా మరింత ఖరీదైనవిగా మారతాయి.
