Kinetic Green Zulu Scooter : భారత్‌కు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసిందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 104కి.మీ దూసుకెళ్తుంది..!

Kinetic Green Zulu Scooter : కైనెటిక్ గ్రీన్ జులూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త జూలు ఈవీ స్కూటర్ 2.27kWh బ్యాటరీ, సింగిల్ ఛార్జ్‌తో 104 కి.మీల రేంజ్ పరిధిని అందిస్తుంది.

Kinetic Green Zulu electric scooter launched in India

Kinetic Green Zulu Scooter : ప్రముఖ పుణెకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ కైనెటిక్ గ్రీన్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త జులూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ జులూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ రూ. 94,990 ఎక్స్-షోరూమ్‌ ధరతో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

Read Also : Tata Car Discounts 2023 : ఈ డిసెంబర్‌లో టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. సఫారి టు టిగోర్‌ వేరియంట్లపై రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు!

జులూ ఇ-స్కూటర్ స్వదేశంలోని తయారు చేయగా బ్యాటరీతో విక్రయిస్తున్నట్టు ఈవీ తయారీదారు ధృవీకరించింది. కైనెటిక్ గ్రీన్ జులూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల పరంగా.. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, డిజిటల్ స్పీడోమీటర్, ఆటో-కట్ ఛార్జర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ లైట్ వంటి మరిన్నింటిని కలిగి ఉంది. 160మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో, జులూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది.

జులూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
కైనెటిక్ గ్రీన్ జులూ ఇ-స్కూటర్ 1,830మిమీ పొడవు, 1,135 మిమీ ఎత్తు, 715 మిమీ వెడల్పు కలిగి ఉంటుంది. 1,360మీమీ వీల్‌బేస్, 93 కిలోల కర్బ్ వెయిట్ కలిగి ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 150 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. జూలు ఇ-స్కూటర్‌కు శక్తినిచ్చే 2.27kWh బ్యాటరీ, ఛార్జ్‌కి 104 కిమీల క్లెయిమ్ పరిధిని అందిస్తుంది. 2.1కెడబ్ల్యూ బీఎల్‌డీసీ హబ్ మోటార్‌తో అమర్చి గంటకు 60కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు.

Kinetic Green Zulu electric scooter 

ఈవీ స్కూటర్‌లో సస్పెన్షన్ సెటప్, బ్రేకింగ్ సిస్టమ్‌ యువ రైడర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫ్రంట్ ఫోర్క్స్, అరుదైన డ్యూయల్ షాక్ సస్పెన్షన్ సెటప్‌ కలిగి ఉంది. ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా కైనెటిక్‌ గ్రీన్ ఈ కొత్త జులూ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది.

స్వదేశంలోనే తయారైన ఈ స్కూటర్ల డెలివరీలు 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. రానున్న ఐదేళ్లలో 10 లక్షల ఈవీ స్కూటర్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. కైనెటిక్ గ్రీన్ భారత్‌లో ఇ-గోల్ఫ్ కార్ట్‌లను తయారు చేయడానికి లంబోర్ఘినితో భాగస్వామ్యం కలిగి ఉంది.

Read Also : BMW Cars Price Hike : జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న బీఎండబ్ల్యూ కార్ల ధరలు.. అసలు కారణం ఇదే!