ప్రపంచంలో కరోనా వైరస్ ధాటికి జన బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. జన సమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ పారిశుధ్య పనుల నిర్వహణ మెరుగు పరిచారు. ప్రజలకు అవగాహన పెంచేందుకు వివిధ మాధ్యమాల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ ప్రచారం చేపట్టింది. ప్రజలు కరోనా బారిన పడకుండా ముక్కుకు మాస్క్ లు ధరిస్తున్నారు.
ఇప్పుడ ఈ మాస్క్ లకు మార్కెట్ లో డిమాండ్ పెరిగి పోయింది. వాటి కొరత తీవ్రంగా ఉంది. స్టాక్ అయిపోవటంతో వ్యాపరస్తులువాటిని 10 రెట్లు రెట్టింపు ధరకు అమ్మి లాభాలు ఆర్జిస్తున్నారు. కానీ కేరళలోని కొచ్చి కి చెందిన ఒక మెడికల్ డిస్ట్రిబ్యూటర్ మాత్రం మాస్క్ లను అసలు ధర రూ.2 లకే విక్రయించి ప్రశంసలుపొందాడు.కొచ్చిలోని కొచ్చిన్ సర్జికల్స్ యజమాని తస్లీమ్ పికే మట్లాడుతూ…ఆస్పత్రి సిబ్బందికి, కేరళ ప్రభుత్వ ఉద్యోగులు, హై కోర్టు సిబ్బందితో సహా జనసమ్మర్ధం కల ప్రాంతాల్లో పనిచేసే వారికి సుమారు 4,500 మాస్క్ లను పంపిణీ చేసినట్లు చెప్పారు.
నేను గతంలో 2 రూపాయలకే మాస్క్ లు కొనుగోలు చేశామని ఇప్పుడు ధర పెరిగి 8 రూపాయలకుకొనుగోలు చేస్తున్నామని..ప్రజా సంక్షేమం కోసం కరోనా వ్యాప్తి చెందకుండా లాభం చూసుకోకుండా కొనుగోలు ధరకే అమ్ముతున్నట్లు తస్లీమ్ చెప్పాడు. ఫేస్ మాస్క్ ల డిమాండ్ ఇప్పుడు మార్కెట్ లో ఉందని…కేంద్ర ప్రభుత్వం N95 కేటగిరీ మాస్క్ లను నిషేధించటంతో నిన్నటిదాకా రూ .250 చొప్పున అమ్మిన మాస్క్ ఇప్పుడు రూ .150లకే మార్కెట్ లో లభిస్తోంది.